Kodali Nani: స్వర్గీయ నందమూరి తారకరామారావు నటించిన బొబ్బిలిపులి సినిమాలో.. “ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఓ వెంకట్రావు ఓ రంగారావు ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా..?” అనే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ పాటకు మంచి ఆధరణ ఉంది.. అయితే, ఇప్పుడు ఆ పాట గురించి ఎందుకు? అనే అనుమానం రావొచ్చు.. విషయం ఏంటంటే.. ఆ పాటను మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గుర్తు చేశారు. తాజాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు.. నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న విషయం విదితమే.. అయితే, దీనిపై సెటైర్లు వేస్తూ ఆ పాటను గుర్తు చేసుకున్నారు కొడాలి నాని..
Read Also: Kalki 2898AD: ఇది కదా మనకు కావాల్సిన ఎమోషన్.. చిరును ఇమిటేడ్ చేసిన ప్రభాస్
40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ సినిమాలో ఓ పాట ఉండేది.. ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా..? అన్నట్లుంది యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు కొడాలి నాని.. ఇక, 2024 ఎన్నికల్లో ఓటమిని ముందే గ్రహించిన చంద్రబాబు.. ఓట్ల తొలగింపును కారణంగా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు అని విమర్శించారు.. గన్నవరంలో లోకేష్ పాదయాత్ర చేస్తే గుడివాడలో ట్రాఫిక్ జామ్ అయ్యిందంటూ సెటైర్లు చేశారు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బాల్ బచ్చా లోకేష్.. నువ్వా సీఎం గురించి మాట్లాడటమా..? అని ఫైర్ అయ్యారు. మరోవైపు.. 64 పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే పది చోట్ల గెలిచిన టీడీపీ.. 175 అసెంబ్లీ స్థానాల్లో జరిగే ఎన్నికల్లో 22 చోట్ల తెలుస్తుందేమో అంటూ కామెంట్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.