Mudragada Padmanabha Reddy: మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా ఓ భారంగా లేఖను విడుదల చేసారు. ఈ లేఖలో ఆయన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఇక ఆయన విడుదల చేసిన బహిరంగ లేఖలో.. ఈ మద్య మాకుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి, మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్దలు వచ్చాయి. ఒక సంవత్సరము నుండి పూర్తిగా అన్ని రకాల రాకపోకలు బంద్ అయ్యాయని.. వారి జోలికి నేను వెళ్ళడం లేదు, అయినా మమ్ములను టార్గెట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీని కారణం మా చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగలిపోతున్నారని.. నాకు కేన్సర్ వచ్చిందని ఇంట్లో బందించి చిన్న కొడుకు, వారి మామగారు పట్టించుకోవడం లేదని బాధాకరమైన మాటలు అంటున్నారని.. ఈ రోజు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్నకొడుకే 100 శాతం కారణం అని అన్నారు.
Read Also: Chintha Chiguru: అనేక రోగాలకు దివ్య ఔషధంగా చింత చిగురు..!
వారి ఉద్దేశ్యం మా అబ్బాయిని దూరం చేస్తే వారింటికి చేరతానని, వారి అడుగులకు మడుగులోత్తుతానని అనుకుంటున్నారేమో? అది ఈ జన్మకు కాదు ఎన్ని జన్మలు ఎత్తినా ఆ ఇంటికి వెళ్ళడం జరగదూ… జరగదు అంటూ తెలిపారు. గతంలో నా భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు హైదరాబాద్ హాస్పటల్లో ఆపరేషన్ చేయించుకుని సుమారు 15 రోజులు తరువాత హాస్పటల్ నుండి విశ్రాంతి కోసం మీ ఇంటికి వస్తే ఇంటి నుండి బయటికి పంపిన సంగతి మీ ఇరువురూ మరిచిపోయారా? ఇప్పుడు మీ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. అని ఆయన తెలిపారు.
Read Also: Kakani Govardhan Reddy: మాజీ మంత్రిపై వరుస కేసులు.. అక్రమంగా టోల్ గేట్‌ను ఏర్పాటు చేసారంటూ..?
నాకు వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవని.. నేను పార్టీ కార్యక్రమాలకు హాజరగుతున్నానని, నిత్యం నా ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నానని.. నన్ను బంధించి ఉంచడం కాని, మానసికంగా హించించడం కాని ఎవ్వరి తరం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వ జీ.వోలపై ఆ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారు. మీకు అంత దమ్ము ఉంటే కాపు రిజర్వేషన్, ముఖ్యమంత్రి ఎన్నికలలో ఇచ్చిన హామీలను, సూపర్ సిక్స్ పధకాలును అమలు చేయించి మీ దబ్బా కొట్టుకోండి.. నిజంగా అదే నిజమైతే రాష్ట్ర ముఖ్యమంత్రిని, లోకేష్ బాబుని, ఉప ముఖ్యమంత్రిని చూసి జాలి పడుతున్నానండి అంటూ రాసుకొచ్చారు. ఇకనైనా మీ అపాయింట్మెంట్లు, చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బ్రతక్కండి అంటూ కూతురు క్రాంతి ని ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేసారు ముద్రగడ.