ప్రజాదర్బార్ లో వచ్చే సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 47వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు లోకేష్..
ప్రజలు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నపాలు అందజేశారు. 41వ రోజు “ప్రజదర్బార్” లో ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
28వ రోజు కూడా మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు క్యూ కట్టారు ప్రజలు.. అయితే, భూవివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు లోకేష్.. సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు.
Minister Nara Lokesh Meets Goldsmiths: ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రజా దర్బార్‌లో మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేసి.. కార్మికులను ఆదుకుంటాం అని చెప్పారు. మంగళగిరిని గోల్డ్ హబ్‌గా రూపొందిస్తామనే హామీకి తాము కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ చెప్పారు. అమరావతిలో నేడు జరిగిన ప్రజా దర్బార్‌లో పలువురు స్వర్ణకారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మంత్రికి తమ…
ఏపీ మంత్రి నారా లోకేశ్ తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు మంచి చేసేందుకు రంగంలోకి దిగారు. శనివారం మంగళగిరి ఎమ్మెల్యేగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 'ప్రజా దర్బార్' ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.. రెండో రోజూ ఆదివారం కూడా ప్రజా దర్బార్‌ను మంత్రి నారా లోకేష్ నిర్వహించారు.