ఏపీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్గ గుడి ఉద్యోగుల అవినీతిపై ఏసీబీ దాడులు చేస్తే మంత్రి వెల్లంపల్లిపై ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. అక్రమాలు సహించేదే లేదంటూ ప్రభుత్వమే తనిఖీలు చేయిస్తోందని… దుర్గగుడి ఉద్యోగులపై ఏసీబీ సోదాల విషయంలో రాజకీయ ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. దుర్గ గుడి ఈవో తప్పు చేశారని.. లెక్క తేలితే బొక్కలు పగులుతాయని హెచ్చరించారు. అవినీతిని ఊపేక్షించే విషయంలో ఈవో లేదు.. డీవో లేదు.. అందరి మీద…