నేచురల్ స్టార్ తో వకీల్ సాబ్ డైరెక్టర్ మరోసారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అనుకుంటాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అందుకే అతని ఖాతాలో ఇప్పటికి కేవలం మూడు సినిమాలే జమనైనాయి. 2011లో ఓ మై ఫ్రెండ్, 2017లో మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత మళ్ళీ ఇంతకాలానికి పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేశాడు వేణు శ్రీరామ్. ఈ మూడు సినిమాలను నిర్మించింది దిల్ రాజే కావడం విశేషం. ఇదిలాఉంటే… ఇప్పటికే అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ ఐకాన్ మూవీ చేసి ఉండాల్సింది. కారణాలు ఏవైనా అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న సమాచారం ఏమంటే… ఇటీవల నేచురల్ స్టార్ నానికి వేణు శ్రీరామ్ ఓ స్టోరీ లైన్ చెప్పాడట. అది నచ్చడంతో దానిని పూర్తి స్థాయి కథగా మలచమని నాని అన్నాడట. సో… అల్లు అర్జున్ ఐకాన్ సంగతి ఎలా ఉన్నా… వేణు శ్రీరామ్… హీరో నానితో ఓ మూవీని అతి త్వరలోనే చేస్తాడని అంటున్నారు. ఇప్పటికే టక్ జగదీశ్ మూవీని పూర్తి చేసిన నాని, శ్యామ్ సింగరాయ్ షూటింగ్ లో ప్రస్తుతం పాల్గొంటున్నాడు. దాని తర్వాత అంటే సుందరానికి... మూవీ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే వేణు శ్రీరామ్ మూవీ పట్టాలెక్కుతుంది. విశేషం ఏమంటే… గతంలో నాని, వేణు శ్రీరామ్ తో మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజే ఈ సినిమానూ నిర్మిస్తాడని అంటున్నారు.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!