కొవిడ్ 19 మహమ్మారితో కుదేలవుతున్న కుటుంబాలు ఎన్నో. అయితే… దాని బారిన పడిన వ్యక్తులను ఆదుకోవడానికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ చేస్తున్న సేవలకు వెలకట్టలేం. తమ జీవితాలను పణంగా పెట్టి మరి హాస్పిటల్స్ లో, క్వారంటైన్ సెంటర్స్ లోని డాక్టర్లు, నర్సులు పేషంట్స్ కు సేవ చేస్తున్నారు. వాళ్ళ రుణం తనదైన పంథాలో తీర్చుకోవాలని నేచురల్ స్టార్ నాని భావించినట్టున్నాడు. అందుకోసమే ఓ షార్ట్ ఫిల్మ్ ను వారి సేవలను కొనియాడుతూ తీస్తున్నట్టు తెలిస్తోంది. ఫర్ అవర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, సమ్ థింగ్ స్పెషల్ కమింగ్ సూన్
అంటూ నాని కామెంట్ పెట్టి… ఓ స్టిల్ ను విడుదల చేశాడు. అందులోని బృందాన్ని చూస్తుంటే వాళ్ళంతా కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ తీసున్నట్టే అనిపిస్తోంది. అవిశ్రాంతంగా వైద్య సేవలలో మునిగి తేలుతున్న వారికి నాని తీస్తున్న లఘు చిత్రం ఊరటను ఇవ్వడంతో పాటు, సామాన్య ప్రజలలో వైద్యుల పట్ల ఆదరణ భావం పెరిగేట్టు చేస్తుందేమో చూడాలి.