నాని తిక్కిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వెలిచర్ల ప్రదీప్ రెడ్డి నిర్మించిన సినిమా ‘ఫిమేల్’. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ రివేలింగ్ పోస్టర్ ను తెలంగాణ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడి, మగాళ్లలో మార్పు తీసుకువచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నానని సబితా ఇంద్రారెడ్డి…