డైనమిక్ స్టార్ నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించనున్న 22వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సోమవారం(జూలై5), కళ్యాణ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఇదే బ్యానర్‌లో ఇంతకు ముందు కళ్యాణ్‌రామ్ చేసిన చిత్రం 118సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. మరోసారి ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌లో కళ్యాణ్‌రామ్ చేయబోయే సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. చిత్ర దర్శకుడు, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక…
నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంతకాలంగా తెర వెనుక ఎంత హోమ్ వర్క్ చేస్తున్నాడో ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటిస్తున్న సినిమాలను చూస్తే అర్థమైపోతోంది. ఒకటి కాదు రెండు కాదు మూడు, నాలుగు సినిమాలను కళ్యాణ్ రామ్ క్యూలో పెట్టాడని తెలుస్తోంది. అందులో ‘డెవిల్’ లాంటి పాన్ ఇండియా మూవీ ఉండటం విశేషం. ఇంతవరకూ కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై పెదవి విప్పిందే లేదు. ‘బాబు బాగా బిజీ’ ఫేమ్ నవీన్ మేడారం దర్శకత్వంలో…
(నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా) బాల్యంలో యమ దూకుడుగా ఉన్న ఆ కుర్రాడిని ఇప్పుడు చూసిన వాళ్ళు, ఇంత సౌమ్యుడై పోయాడేమిటీ? అని ఆశ్చర్యపోతారు! యుక్తవయసులో అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే ఆ కుర్రాడు… వెండితెరపై ఇంతలా రొమాన్స్ పండిస్తున్నాడేమిటా అని విస్తుపోతారు! తాతగారు, మహానటుడు ఎన్టీఆర్ పేరును తన సొంత బ్యానర్ కు పెట్టుకున్నందుకు, అంతే భక్తి శ్రద్ధలతో సినిమాలు నిర్మిస్తున్న అతన్ని చూసి ఆనంద పడతారు! అతనే నందమూరి కళ్యాణ్ రామ్!!…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతవరకూ ఏదీ రాలేదు. అయితే అది ఏ రోజైనా రావచ్చుననే అంతా భావిస్తున్నారు. ‘ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వార్మ్’ అన్నట్టుగా విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించేశారు. మరో వైపు మంచు విష్ణు తన తండ్రిని తోడ్కొని సినిమా పెద్దల్ని కలిసి వస్తున్నారు. అయితే ఇవాళ తన ప్యానల్ తరఫున నిలబడబోయే వారి పేర్లను…
యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం “బింబిసారా”. నటసార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. ఇది కళ్యాణ్ రామ్ కు 18వ చిత్రం. కత్తిని పట్టుకుని కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో, గెటప్ లో కన్పించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మృతదేహాల సమూహంపై కూర్చుని ఉన్న కళ్యాణ్ మేక్ఓవర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. టైం ట్రావెల్ తో తెరకెక్కనున్న ఈ సోషల్ ఫాంటసీలో భారీ…