నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలిసి మాస్ ట్రీట్ అందించబోతున్న విషయం తెలిసిందే. పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా వీరిద్దరి కాంబోలో ‘ఎన్బీకే 107’ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో నటించబోయే తారల గురించి మేకర్స్ అప్డేట్స్ రూపంలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్, దునియా విజయ్ నటించబోతున్నారని తెలిపిన టీం తాజాగా వరలక్ష్మి శరత్కుమార్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రంలో ఓ పవర్ ఫుల్…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో నిరాటకంగా కొనసాగుతోంది.స్టార్ హీరోలు, బాలయ్య పంచ్ లు, కావాల్సినంత వినోదం అందుతుండడంతో అభిమానులు ఈ షో కి ఫిదా అయిపోతున్నారు. ఇక మహేష్ బాబు ఎపిసోడ్ తో సీజన్ ముగిస్తున్నాము అని ఆహ వారు ప్రకటించిన విషయం తెలిసిందే. మహేష్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా రానుంది. ఇక మధ్యలో మరో స్టార్ హీరో తో బాలయ్య రచ్చ చేయనున్నాడు. ఇక ఇటీవలే 7వ ఎపిసోడ్…
ఈ నూతన సంవత్సరంలోనైనా కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసిన నందమూరి బాలకృష్ణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్తో మహమ్మారి మరో మారు విజృంభిస్తున్న వేళ అందరూ మరింత బాధ్యతతో మెలుగుతూ పూర్తి శక్తి సామర్థ్యాలతో రోగులకు సేవలు అందేలా…
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాదిలో రిలీజైన అఖండ.. అఖండ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్లను రాబడుతోంది. ఇక ఆహా లో అన్ స్టాపబుల్ షో తో అలరిస్తున్న బాలయ్య.. ఆయన షో కి వచ్చిన హీరోల సినిమాలను వీక్షించారు. నిన్నటికి నిన్న పుష్ప సినిమాను ఫ్యామిలీతో వీక్షించిన బాలయ్య.. తాజాగా నాని శ్యామ్ సింగారాయ్ సినిమాను వీక్షించారు. బాలకృష్ణ కోసం నాని స్పెషల్ స్క్రీనింగ్ ని ఏర్పాటు…
ఈ ఏడాది డిసెంబర్ టాలీవుడ్ కి కలిసి వచ్చింది. ఈ నెలలో విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. బాలకృష్ణ అఖండ, బన్నీ పుష్ప, నాని శ్యామ్ సింగరాయ్… కరోనా తరువాత థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలు ప్రేక్షకులను కనువిందు చేశాయి. ఇకసినీ ప్రముఖులు సార్థం థియేటర్లు కి వెళ్లి సినిమాలు చూస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కుటుంబంతో సహా పుష్ప సినిమాను వీక్షించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు బాలయ్య కోసం స్పెషల్ స్క్రీనింగ్…
నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో ఆరో ఎపిసోడ్ భలే సందడి చేసిందనే చెప్పాలి. ‘అఖండ’ విజయం సాధించిన ఉత్సాహం ఓ వైపు… ‘పుష్ప’ విజయసువాసనలు మరో వైపు పరిమళిస్తూండగా సాగిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో రక్తి కట్టించింది. ఈ కార్యక్రమంలో ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ ముందుగా హాజరయ్యారు. తరువాత నాయిక రష్మిక వచ్చేసింది. చివరలో అల్లు అర్జున్ రాగానే సందడి మరింత పెరిగింది. 47 నిమిషాల పాటు సాగిన…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వవహరిస్తున్న అన్ స్టాపబుల్ ఆహా లో ఎంతటి రచ్చ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద డైరెక్టర్లు, కుర్ర హీరోలు అని లేకుండా అందరితోను బాలయ్య పంచ్ లు, జోకులు, వారితో ఆటలు ఆడించడం, వారి చేత కొత్త సీక్రెట్లు బయటపెట్టించడం .. అబ్బో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో డైమండ్. ఇక ఇప్పటికే 5 ఎపిసోడ్లు అద్భుతంగా పూర్తిచేసుకున్న ఈ టాక్ షో 6 వ ఎపిసోడ్ కి సిద్ధమైంది.…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ ముగిసిపోతోంది. ఏంటి అప్పుడేనా..? మొన్ననే కదా స్టార్ట్ అయ్యింది.. అంటే అవును మొన్ననే స్టార్ట్ అయిన ఈ టాక్ షో 8 ఎపిసోడ్లతోనే సీజన్ పూర్తి చేసుకోనుంది. ఈ విషయాన్నీ ఆహా మేకర్స్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. బాలయ్య టాక్ షో అనగానే వామ్మో అని భయపడిన అభిమానులు మొదటి ఎపిసోడ్ చూశాక బాలయ్యలోని కొత్త కోణాన్ని చూశారు . వరుసగా మోహన్ బాబు,…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ .. ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఆసక్తికరంగా మారుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో బాలయ్య సందడి చేస్తున్న తీరు ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తోంది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో 6 వ ఎపిసోడ్ కి సిద్దమవుతుంది . 6 వ ఎపిసోడ్ లో పుష్పరాజ్ అల్లు అర్జున్ బాలయ్య తో సందడి చేయనున్నాడు. క్రిస్టమస్ కానుకగా ఈ ఎపిసోడ్ డిసెంబర్ 25 న విడుదల…
టేకాఫ్ లో కాసింత తడబాటు, ఆ పై ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోలా మాటలతో తిరుగుబాటు- ఇలా ఇప్పటికి ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ నాలుగు ఎపిసోడ్స్ కానిచ్చేశారు. వాటన్నిటి కంటే భిన్నంగా సాగింది ఐదవ ఎపిసోడ్. ఇందులో దర్శకధీర రాజమౌళి గెస్ట్ గా రావడం, ఆయనకు తగ్గ ప్రశ్నలతో బాలయ్య సందడి చేయడం ఎంతగానో ఆకట్టుకుంది. మరో విశేషమేమిటంటే, ఈ ఎపిసోడ్ గంట పాటు ఉండడం! కుటుంబం విలువలు చెబుతూ,…