నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ’ తో ముందుకొచ్చి సినీ ప్రేక్షకుల దాహాన్ని తీర్చేశారు. ఇక అన్ స్టాపబుల్ షో తో బుల్లితెర ప్రేక్షకులతో పాటు అభిమానులందరికి చేరువయ్యాడు. ఈ షో మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు బాలయ్య లుక్ అదిరిపోయింది. హెయిర్, డ్రెస్సింగ్ అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అయితే ఈ కష్టం వెనుక ఉన్నది ఎవరో ప్రముఖ రైటర్, దర్శకుడు బీవీఎస్ రవి చెప్పేశారు. అన్ స్టాపబుల్ షో కి ఆయన రైటర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య వేసే పంచ్ లు, సెటైర్ల వెనుక బీవీఎస్ రవి ఉన్నట్లు తెలిసిందే. తాజగా ఆయన ఒక ఇంటర్వ్యూ లో ఒక సీక్రెట్ ని రివీల్ చేశారు. బాలయ్య కాస్ట్యూమ్స్, లుక్ వెనుక బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఉన్నారంట . ఆమె దగ్గరుండి తండ్రి లుక్ ని మార్చేసిందంట. ఎలాంటి డ్రెస్ కి ఎలాంటి హెయిర్ స్టైల్ వాడాలి.. ఏ ఎపిసోడ్ కి ఏ క్యాస్టూమ్ వాడాలి అనేది ఆమె దగ్గర ఉండి చూసుకున్నారట.
‘అన్‌స్టాపబుల్’ టీమ్‌తో తేజస్విని పనిచేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో రీసెర్చ్ చేసి మరి జాగ్రత్తలు తీసుకున్నదని చెప్పుకొచ్చారు. దీంతో అందరు ఔరా.. నిజమా అని నోళ్లు వెళ్లబెడుతున్నారు. తేజస్విని ప్రస్తుతం హైదేరాబద్ లోని అత్తగారింట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. తండ్రి చేస్తున్న మొదటి టాక్ షో సక్సెస్ కావాలని ఆమె ఏంటో తపన పడ్డారని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ లో బాలయ్య ఆహార్యం విషయంలో తేజస్విని కష్టం ఫలించిందనే చెప్పాలి. మరి సీజన్ 2 లో నందమూరి నట సింహం ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.