కరోనా కారణంగా వాయిదా పడ్డ నుమాయిష్‌ను ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ కొనసాగనుంది. ఇందుకోసం అన్ని శాఖల నుంచి అనుమతులు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈమేరకు స్టాళ్ల నిర్వాహకులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకవేళ స్టాళ్ల నిర్వాహకులు సిద్ధంగా లేకపోతే ఫిబ్రవరి 25 నుంచి నుమాయిష్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల నుంచి అనుమతులపై రెండురోజుల్లో…
కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. గత నెల మొదటి వారంలో దేశవ్యాప్తంగా 9 వేల లోపు నమోదైన కరోనా కేసులు, తాజాగా ఒక్కరోజులోనే 90వేలకు పైగా నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న నాంపల్లి నుమాయిష్ ఈ ఏడాది పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నందున ఈ నిర్ణయం…