Wife Killed Husband: విశాఖపట్నంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతుంది. పోలీసుల ధర్యాప్తులో హత్య కేసుగా తేలింది.. భార్యే ప్రియుడు మోజులో పడి హత్య చేయించింది. నెల రోజుల క్రితం మిస్సింగ్ కేసుగా నమోదై ఎన్నో మలుపులు తిరిగిన మర్డర్ కేసుగా మారింది. గత నెల డిసెంబర్ 9వ తేదీన కనిపించకుండా పోయిన మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన అల్లాడ నాగరాజు శవమై తేలాడు. డిసెంబర్ 9న తన భర్త కనిపించడం లేదని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య రమ్య.. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
Read Also: 9000mAh బ్యాటరీ, 165Hz ఓరియంటల్ స్క్రీన్తో OnePlus Turbo 6 లాంచ్ ఫిక్స్
ఇక, నెల రోజుల తర్వాత మిస్సింగ్ అయినా నాగరాజు మృతదేహం లభ్యం అయ్యింది. తిమ్మాపురం రోడ్డు వద్ద కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు పోలిసులు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు భార్య పాత్రపై అనుమానం వ్యక్తం చేసి తమదైనా శైలిలో విచారించగా అసలు గుట్టు బయట పడింది. గత కొన్ని రోజుల నుంచి వసంత రావుతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను అడ్డు తొలగించాలనుకుంది. ఇక, ప్రియుడు వసంత రావుతో పాటు అతడి స్నేహితులు బాలకృష్ణ, పండులా సాయంతో నాగరాజును హత్య చేయించింది. మళ్లీ ఏమి ఎరుగనట్టు పోలీసులకు తన భర్త కనిపించడ లేదని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మృతుడు భార్య ఆమె ప్రియుడితో పాటు మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.