సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని పేర్కొన్నారు. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయని. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారని తీవ్రంగా విమర్శించారు.
విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నాడు–నేడు రెండో దశ పనులు నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు తొలిదశలో పూర్తైన స్కూళ్ల నిర్వహణను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. వెనుకబడిన వారిపై ప్రత్యేక ధ్యాసపెట్టి, వారు మెరుగ్గా తయారవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.