CM Jagan Mohan Reddy: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందంతో సీఎం జగన్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి జగన్ తో ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం భేటీ అయింది. భారత్ లో ప్రపంచబ్యాంకు డైరెక్టర్ Auguste Tano Koume నేతృత్వంలో బృందం భేటీ జరిగింది. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఏపీ ప్రజారోగ్య బలోపేతం, ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎడ్యుకేషన్ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్(ఏపీఐఐఏటీపీ) ప్రాజెక్టులు అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రపంచబ్యాంకు భారత్ విభాగానికి డైరెక్టర్ Auguste Tano Koume మాట్లాడుతూ.. ఏపీ రావడం ఇదే తొలిసారి. వివిధ రంగాల్లో మీరు చేరుకున్న లక్ష్యాలను ప్రత్యక్షంగా మేం చూశాం. ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదు.. అనే దానికి మీరు ఉదాహరణగా నిలిచారు. దీనికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా.. మంచి వైద్యం, ఆరోగ్యం, మంచి విద్యను ఎలా అందించవచ్చు? అన్నదానికి మీరు చక్కటి మార్గాన్ని చూపారు. నిర్దేశిత సమయంలోగా సేవలను పౌరులకు అందించడంలో మీరు గొప్ప ఉదాహరణగా నిలిచారు.
దేశంలో దాదాపు 22 రాష్ట్రాలకు మేం రుణాలు ఇస్తున్నాం. వివిధ రంగాల్లో వృద్ధికోసం ఈ రుణాలు ఇస్తున్నాం. మీ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాలు ఒక ఉదాహరణగా తీసుకుని ముందుకు సాగవచ్చు. రాష్ట్రంతో మా భాగస్వామ్యం చాలా రోజులుగా కొనసాగుతోంది. వచ్చే పాతికేళ్లలో మీ విజన్ కు, మీ మిషన్ కు ఈ సహకారం కొనసాగుతుందన్నారు. 2047 నాటి దేశంలానే, రాష్ట్రం కూడా మంచి ఆదాయం ఉన్న రాష్ట్రంగా మారడానికి తగిన సహకారం, మద్దతు మా నుంచి కొనసాగుతుందన్నారు.
Also Read
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
అత్యంత వృద్ధిరేటు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. దేశ సగటు కన్నా.. ఎక్కువ: అభివృద్ధిరేటు చాలా బాగుంది. ప్రజలకు మంచి సర్వీసులు అందుతున్నాయన్నారు. డైనమిక్ పారిశ్రామిక రంగం, వైద్య రంగాలు ఉన్నాయి. సమర్థవంతమైన డైనమిక్ ప్రభుత్వం ఉంది. వరల్డ్ బ్యాంకుతో చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రిగారు స్ఫూర్తిదాయకులు. రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని సీఎం తపనపడుతున్నారు. రాష్ట్రంలో మంచి విధానాలు అమలవుతున్నాయని కొనియాడారు. ప్రపంచంలో ఇతర ప్రదేశాల్లో ఉన్న మంచి విధానాలపై మీకు సూచనలు చేసేందుకు మా వంతు సహకారం అందిస్తాం అన్నారు.
ప్రపంచబ్యాంకు బృందాన్ని ఉద్దేశించి సీఎం వైయస్.జగన్ మాట్లాడారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కోరుతున్నా అన్నారు. ఈ కార్యక్రమాల్లో మరింతగా ప్రపంచబ్యాంకు భాగస్వామ్యాన్ని మేం ఆశిస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం స్కూళ్ల రూపు రేఖలన్నీ మారుస్తున్నాం. 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం అన్నారు జగన్. 6వ తరగతినుంచి ఐఎఫ్పీ ప్యానెల్స్ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే జూన్ కల్లా వీటిని ఏర్పాటు చేస్తున్నాం. దీంతో బోధనా పద్ధతులను పూర్తిగా మార్చివేస్తున్నాం. ప్రైవేటు స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్లు పోటీపడలేవన్న మాట వినిపించేది. రెండేళ్ల తర్వాత.. ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీపడాల్సిన పరిస్థితులు ఉంటాయన్నారు సీఎం జగన్.
8 వ తరగతి వారికి ట్యాబులు కూడా ఇస్తున్నాం. విద్యాభ్యాసాన్ని అత్యంత సులభతరం చేయడానికే ఈ చర్యలు. అలాగే మధ్యాహ్న భోజనంలో కూడా బాగా మార్పులు తీసుకువచ్చాం అన్నారు. మంచి పౌష్టికాహారం, నాణ్యతతో కూడా ఆహారాన్ని అందిస్తున్నాం. బైలింగువల్ టెక్స్ట్‌బుక్స్, వర్క్ బుక్స్‌ఇస్తున్నాం. విద్యాకానుకలో భాగంగా డిక్షనరీ ఇస్తున్నాం. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి ఇస్తున్నాం. పిల్లల హాజరుతో అనుసంధానం చేసి పథకాన్ని అమలు చేస్తున్నాం అని తెలిపారు సీఎం జగన్. ఆరోగ్యశ్రీని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాం అని వివరించారు. ఆర్బీకేలు ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నాం. వైద్యం, విద్యం, వ్యవసాయం.. ఈమూడు రంగాల్లో చాలా మార్పులు తీసుకు వచ్చాం. రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం అన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలకు.. సమూల పరిష్కారాలను చూపే దిశగా ముందుకు సాగుతున్నాం. ప్రపంచబ్యాంకు ఈ కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని కోరుతున్నా అన్నారు. కేవలం ఆర్థికంగానే కాకుండా మంచి విధానాలను అమలు చేయడంలో, సాంకేతికంగానూ.. ఇలా తమ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు సీఎం జగన్.
Read Also: Jagadish Reddy: బీఆర్ఎస్‌ని చూసి.. మోడీ & గ్యాంగ్‌కు భయం పట్టుకుంది
తాజావార్తలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?