65 ఏళ్ళ ‘శ్రీ గౌరీ మహాత్మ్యం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(అక్టోబర్ 5తో ‘శ్రీగౌరీ మహాత్మ్యం’కు 65 ఏళ్ళు)
‘శ్రీ గౌరీ మహాత్మ్యం’ చిత్రానికి ‘మంగళగౌరీ వ్రతకథ’ అనే ఉప శిర్షీక కూడా ఉంటుంది. నటరత్న యన్.టి.రామారావు కథానాయకునిగా మహీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. డి.యోగానంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని పి.ఎస్.శేషాచలం నిర్మించారు.
Also Read
భక్తి రసం తోడయిన జానపద కథ ఇది. భక్తజనాన్ని భలేగా ఆకట్టుకుంది. 1956 అక్టోబర్ 5న ‘శ్రీ గౌరీ మహాత్మ్యం’ జనం ముందు నిలచింది. వారి మనసులు గెలిచింది. 1956లో నవరాత్రుల మొదటి రోజున ఈ సినిమా విడుదల కావడం విశేషం.
‘శ్రీగౌరీ మహాత్మ్యం’ కథ విషయానికి వస్తే- ఒక రాజుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సత్యవతీదేవి అమ్మవారి భక్తురాలు. రెండో భార్య సత్యభామ. సత్యవతీ దేవికి అమ్మవారి కరుణతో గౌరి జన్మిస్తుంది. ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది. సవతి తల్లి, ఆమెను ఎలాగైనా కష్టాల పాలు చేయాలని చూస్తుంది. పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళి చేయాలని నిర్ణయిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పొరుగు దేశపు రాకుమారుడు బాలవీరుడు మారు వేషంలో వచ్చి, గౌరిని పెళ్ళాడతాడు. తరువాత అతను తన నిజరూపం ప్రదర్శిస్తాడు. బాలవీరుడు తండ్రి చేసిన ఓ అకార్యానికి శివుడు శాపం ఇచ్చి ఉంటాడు. ఆ కారణంగా బాలవీరుడు మృత్యువాతకు గురి కావాలి. అయితే తన మంగళగౌరీ వ్రతాన్ని చేసుకొనే గౌరి పసుపుకుంకుమ కాపాడాలని అమ్మవారు ప్రయత్నిస్తారు. శివుడు ఆగ్రహించి, ఓ సర్పాన్ని బాలవీరుని కాటు వేయమని పంపుతాడు. అమ్మవారు సదా రక్షిస్తూ ఉంటుంది. ఓ సారి మాత్రం ఆ పాము కాటుకు గురవుతాడు బాలవీరుడు. దాంతో ఆగ్రహించిన గౌరి, ఆ పాము గొంతు పట్టుకుంటుంది. అప్పుడు పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై వారిని కరుణిస్తారు. బాలవీరుని ప్రాణాలు దక్కుతాయి. బాలవీరుడు, గౌరిని ఆదిదంపతులు దీవించడంతో కథ సుఖాంతమవుతుంది.
బాలవీరునిగా యన్.టి.రామారావు, గౌరిగా జూనియర్ శ్రీరంజని నటించగా, శివునిగా కాంతారావు, పార్వతిగా లత నటించారు. ఇందులో రేలంగి, ముక్కామల, సీఎస్సార్, వంగర, బాలకృష్ణ, ఎస్.వరలక్ష్మి, సూర్యకాంతం, పి.హేమలత, పుష్పవల్లి, సీత, సూర్యకళ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఓగిరాల రామచంద్రరావుతో కలసి టి.వి.రాజు సంగీతం సమకూర్చారు. “వలలోన చిక్కిందిరా…” అనే పాటను కొసరాజు రాయగా, మిగిలిన 15 పాటలను మల్లాది రామకృష్ణశాస్త్రి రాశారు. శృంగారం రాసిన మూలకథకు మల్లాది రచన చేశారు. “శ్రీమించుమా…”, “నీవెక్కడ…”, “భలేభలే గారడీ…”, “నీవు నేనును…” వంటి పాటలు అలరించాయి.
‘శ్రీగౌరీ మహాత్మ్యం’ ఆ రోజుల్లో భక్త కోటిని భలేగా అలరించింది. రిపీట్ రన్స్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్ళు చూపింది.
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..