మైత్రీ మూవీ మేకర్స్ నుండి రాబోతున్న తొలి ఓటీటీ ఫిల్మ్ 'సత్తి గారి రెండెకరాలు' టీజర్ విడుదలైంది. 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను అభినవ్ దండా తెరకెక్కించాడు.
మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన తొలి ఓటీటీ మూవీ 'సత్తిగాని రెండు ఎకరాలు' ఆహాలో ఈ నెల 17న స్ట్రీమింగ్ కానుంది. 'పుష్ప' సినిమాలో నటించిన జగదీశ్ ప్రతాప్, రాజ్ తిరందాసు ఇందులో కీలక పాత్రలు పోషించడం విశేషం.
ఈ యేడాది ప్రారంభంలోనే 'వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య' చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఫిబ్రవరి 10న వస్తున్న 'అమిగోస్' కూడా హిట్ అయితే... ఈ సంస్థకు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ లభించినట్టే!!
ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలలో ఆ ముగ్గురూ రెండేసి సినిమాలతో సందడి చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు శ్రుతీహాసన్, థమన్ కూడా రెండో సినిమాలతో జనం ముందుకు రావడం విశేషం.
నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేస్తే బాక్సాఫీస్ రికార్డులు చెల్లాచెదురు అవ్వడం మనం చాలా సార్లు చూసాం. అలాంటి హిస్టరీని మరోసారి రిపీట్ చెయ్యడానికి, ఈ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ గా చేసుకోని… నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’గా మారి ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. జనవరి 12న విడుదల కానున్న ఈ మూవీపై సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలని మరింత పెంచుతూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు.…
ఏదైనా సాంగ్ ని కానీ వేరే ప్రమోషనల్ కంటెంట్ ని కానీ రిలీజ్ చెయ్యాలి అంటే మేకర్స్ ముందే ఒక డేట్ అండ్ టైం ఫిక్స్ చేసి పలానా రోజు, పలానా సమయంలో మా ప్రమోషనల్ కంటెంట్ వస్తుంది అంటూ అనౌన్స్ చేస్తారు. సినిమాని నిర్మించే ప్రతి ప్రొడక్షన్ హౌజ్ ఫాలో అయ్యే ఈ రూట్ ని బ్రేక్ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ లో చిరంజీవి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’ బాబీ…
నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత ఫ్యాక్షన్ రోల్ లో నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ మంచి జోష్ లో చేస్తున్నారు. ‘అఖండ’ తర్వాత బాలయ్య, తమన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే బయటకి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్…