ఇటీవల కాటేదాన్ బ్యాటరీ పరిశ్రమలో పెద్ద మొత్తంలో నగదును ఎత్తికెళ్లిన కేసును ఛేదించిన మైలారేదేవ్‌పల్లి పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులను బుధవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రా, అభినందించి రివార్డులను అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాటేదాన్లో ఉన్న ఓ బ్యాటరీ పరిశ్రమలో బీహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ మసూద్ పదేండ్లుగా నమ్మకంగా పని చేస్తున్నాడు. కాగా యజమాని తెచ్చిన డబ్బులు ఆఫీసు అల్మారాలో పెట్టడం గమనించిన మసూద్ ఈ నెల 1 వ తేదీ రాత్రి బీహార్‌కు…