Myanmar: భారత సరిహద్దు దేశం మయన్మార్‌లో ప్రజాప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుంచి ఆ దేశంలో హింస చెలరేగింది. జుంటా పాలకకు వ్యతిరేకంగా అక్కడ సాయుధ గ్రూపులు పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అక్కడి సైనిక పాలకులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లు సైనికులు కంట్రోల్‌లో ఉన్న చైనా సరిహద్దు సమీపంలోని ప్రాంతాలను మూడు సాయుధ మైనారిటీ గ్రూపులు స్వాధీనం చేసుకున్నాయి. ఉత్తర షాన్ రాష్ట్రంలోని ఉన్న ఈ చైనా సరిహద్దు…
Rohingya refugees: మయన్మార్‌లో హింసకు గురవుతున్న రోహింగ్యాలు బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాలకు వెళ్తున్నారు. అయితే వీరి వల్ల బంగ్లాదేశ్‌లో క్రైమ్ రేట్ పెరుగుతోందని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇండోనేషియాకు వచ్చిన 250 మంది రోహింగ్యా శరణార్థులను స్థానికులు వెనక్కి తిప్పిపంపించారు. రోహింగ్యాలు ఒక చెక్క పడవలో ఇండోనేషియా దక్షిణ ప్రాంతంలోని అచే ప్రావిన్సు తీరానికి చేరుకున్నారు. అయితే కోపంతో ఉన్న స్థానికులు వారిని పడవ దిగొద్దని హెచ్చరించారు. కొంతమంది శరణార్థులు…
Mayanmar Refugees: మనిషి కోరుకునేది రెండు పూటలా జానెడు పొట్టకు పిడికెడు ఆహారం. దాని కోసమే మనిషి నానాయాతన పడుతుంటారు. అయితే ఆ పూట కడుపు నింపే అన్నదానం కంటే అన్ని పూటలా కడుపు నింపే విద్యాదానం చాల గొప్పది. అందుకే ప్రస్తుతం దారిద్రరేఖకు దిగువున ఉన్నవాళ్లు అధికారంలో ఏ పార్టీ ఉన్న మాకు నిత్యావసరాలైన కూడు, విద్యను సమకూరిస్తే చాలు అని వేడుకుంటున్నారు. వివరాలలోకి వెళ్తే.. మణిపూర్ లో అల్లర్లు రేకెత్తిన తరుణంలో అక్కడ నివసించే…
Plane Crashed: శనివారం నేపాల్‌లో మనంగ్ ఎయిర్ హెలికాప్టర్ కుప్పకూలింది. వివరాలలోకి వెళ్తే. ప్రయాణికులను ఎక్కించుకోవడం కోసం ఎవరెస్ట్ బేస్ క్యాంపు సమీపం లోని లుక్లా నుంచి హెలికాప్టర్ 9N ANJ నేపాల్ లోని లోబుచే బయలుదేరింది. కాగా నేపాల్‌లోని లోబుచేలో ల్యాండ్ అయ్యే సమయంలో బోల్తా పడింది. దీనితో హెలికాప్టర్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గురించి నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ నిరౌలా మాట్లాడుతూ.. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్…
Manipur Violence: గత నాలుగు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మెయిటీ, కుకీల మధ్య జాతి ఘర్షణల కారణంగా 175 మంది మరణించారు. చాలా మంది సొంత ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. పరిస్థితి శాంతియుతంగా మారుతుందనుకునే సమయంలోనే మళ్లీ అల్లర్లు మొదలువుతున్నాయి. ఇటీవల ఇద్దరు మెయిటీ విద్యార్థులను మిలిటెంట్లు చంపడం మరోసారి ఆ రాష్ట్రంలో విధ్వంసానికి కారణమైంది. ఏకంగా సీఎం బీరెన్ సింగ్ ఇంటిపైనే ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు.
ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు మయన్మార్ సవాల్‌ను ఎదుర్కొంది. భారత్-మయన్మార్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. అయినప్పటికీ భారత జట్టు ప్రీక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 13 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.
మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి పారిపోతున్న రోహింగ్యా శరణార్థులను తీసుకెళ్తున్న పడవ ఈ వారం సముద్రంలో మునిగిపోవడం వల్ల దాదాపు 17 మంది మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని మునిగిపోయారని అధికారులు గురువారం తెలిపారు.
Earthquake: భారత సరిహద్దు దేశం మయన్మార్ వరసగా భూకంపాలతో వణుకుతోంది. నిన్న అర్థరాత్రి నుంచి వరసగా రెండు భూకంపాలు నమోదయ్యాయి. గురువారం యాంగాన్ లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.
మయన్మార్ లో రాజకీయ ఖైదీల కేసులను తీసుకోకుండా న్యాయవాదులపై అడ్డంకులు, ఆంక్షలు విధిస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది. "మయన్మార్ లో ఇప్పటికే బలహీనమైన న్యాయ వ్యవస్థ తీవ్రంగా క్షీణించింది. న్యాయ హక్కులను సమర్థించడంలో విఫలమైందని 39 పేజీల నివేదికను విడుదల చేసింది.