Pakistan: పాకిస్తాన్ బయటకు ఎన్ని బీరాలు పలుకుతున్నా కూడా తోటి ముస్లిం దేశాలు పట్టించుకోవడం లేదు. సౌదీ అరేబియా, యూఏఈ వంటి ఇస్లామిక్ దేశాలు పాకిస్తానీయులకు నో ఎంట్రీ బోర్డు పెడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వెళ్లిన వారు ఈ దేశాల్లో భిక్షాటన చేయడం, నేరాలకు పాల్పడుతుండటంతో ఆయా దేశాలు వీరికి వీసాలు మంజూరు చేయడం లేదు.
మయన్మార్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. మయన్మార్ భూకంపం భారతదేశాన్ని కూడా కుదిపేసింది. మణిపూర్, నాగాలాండ్, అస్సాంతో సహా భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ప్రస్తుతానికి ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం.. భూకంపం మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు ఆగ్నేయంగా 27 కిలోమీటర్ల దూరంలో, మయన్మార్‌లోని భారత సరిహద్దుకు చాలా దగ్గరగా…
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మరోసారి మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే, అక్కడి యూనస్ ప్రభుత్వానికి, ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌కి పడటం లేదు. ఆర్మీ చీఫ్ హెచ్చరికల తర్వాత యూనస్ ప్రభుత్వం మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి ‘‘మానవతా కారిడార్’’ని తిరస్కరించింది. బంగ్లాదేశ్ ఈ కారిడార్‌ని ‘‘రక్తపాత కారిడార్’’గా పిలిచారు. విదేశాంగ శాఖ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఏకపక్షంగా ఐక్యరాజ్యసమితి ప్రతిపాదిత రఖైన్ కారిడార్ అంగీకరించిందని ప్రకటించారు. దీనిపై ఆర్మీ చీఫ్…
Myanmar Earthquake: గత వారంలో మయన్మార్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం ఆ దేశాన్ని నాశనం చేసింది. 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లోని పలు భవనాలు కుప్పకూలాయి. ముఖ్యంగా మయన్మార్ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటి వరకు, 1700 మంది చనిపోయారు, ఇంకా శిథిలాల కింద వేల మంది ఉన్నారు. వీరి కోసం రెస్క్యూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం, భూకంపం వల్ల మొత్తం మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని…
మయన్మార్‌కు మరోసారి భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆదివారం భారీగా సాయం పంపించింది. శుక్రవారం మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించగా శనివారం ప్రధాని మోడీ ఆదేశాల మేరకు భారీ సహాయాన్ని పంపించారు. ఆదివారం కూడా 30 టన్నుల విపత్తు సహాయాన్ని పంపించారు.
Operation Brahma: భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కి ఇండియా ఆపన్నహస్తం అందిస్తోంది. శుక్రవారం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం రావడంతో ఆ దేశం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటి వరకు 1000 మందికి పైగా ప్రజలు మరణించారు. అయితే, భూకంప బాధిత మయన్మార్‌కి సాయం చేసేందుకు భారత్ ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’ని ప్రారంభించింది. శనివారం ఆ దేశానికి 15 టన్నుల సహాయ సామాగ్రిని పంపిణీ చేసింది. భారత వైమానిక దళం(ఐఎంఎఫ్) C130J సైనిక రవాణా విమానంలో హిండన్…
శక్తివంతమైన భూకంపాలతో గజగజలాడిన మయన్మార్, థాయిలాండ్‌కు కష్టకాలంలో సాయం చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది. శుక్రవారమే అండగా ఉంటామని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మోడీ పిలుపు మేరకు భారత విదేశాంగ శాఖ చొరవ చూపించింది.
మయన్మార్, థాయిలాండ్ శక్తివంతమైన భూకంపం నుంచి ఇంకా తేరుకోకముందే కొన్ని గంటల వ్యవధిలోనే శనివారం ఉదయం ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం... ఉదయం 5.16 గంటల ప్రాంతంలో భూప్రకంపం చోటుచేసుకుంది.
మయన్మార్, బ్యాంకాక్‌లో చోటుచేసుకున్న భూకంపాలు కారణంగా 1000 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద మరికొంత మంది ఉంటారని అనుమానిస్తు్న్నారు. ఇక థాయిలాండ్ ప్రధాని అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
Myanmar earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు 7.7, 6.4 తీవ్రతతో కూడా శక్తివంతమైన భూకంపాల కారణంగా మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్ వణికాయి. సాగింగ్ పట్టణానికి వాయువ్యంగా 16 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉంది.