Congress: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ చీఫ్ నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతుంటే, శివసేన నేత ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆఫర్ ఇచ్చారు. ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రతిపక్షంతో చేరితే షిండే, పవార్‌లు ఇద్దరికీ ముఖ్యమంత్రి పదవులు ఇస్తామని పటోలే శుక్రవారం అన్నారు.
INDIA Alliance: ఢిల్లీలో ఆప్ ఓటమి ఇండియా కూటమిలో విభేదాలను సృష్టించింది. నిజానికి లోక్‌సభ ఎన్నికల తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే ఆప్, కాంగ్రెస్ మధ్య పొగడం లేదు. ఢిల్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ని కాదని టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లు ఆప్‌కి మద్దతు ఇవ్వడం కూడా సంచలనంగా మారింది. దీంతో ఇండియా కూటమిలో పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం ఆప్ ఓటమి తర్వాత కూటమి పార్టీలన్నీ ఇద్దరు కలిసి పోటీ చేయకపోవడాన్ని…
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోరంగా ఓటమి పాలైంది. కూటమిలో పార్టీకి ఆశించ దగ్గ సీట్లు రాలేదు. ఓ వైపు ఈవీఎంలపై నెపం నెడుతున్నా.. ఇంకోవైపు పార్టీలో విభేదాలు మాత్రం కొట్టిచ్చినట్లు కనబడుతున్నాయి.
Maharashtra PCC: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం జరిగింది. ‘మహా’ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రిజైన్ చేశారు.
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాయి. 288 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. ఇదిలా ఉంటే, ఇంకా ఫలితాలు రాకముందే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో సీఎం అభ్యర్థిపై కొట్లాట మొదలైంది.
Supriya Sule: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే ఓటేసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తాను అక్రమ బిట్‌కాయిన్ లావాదేవీలకు పాల్పడినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను తప్పుబట్టింది.
Maharashtra Elections 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో మతం ఆధారంగా ఓట్లు అడిగేలా అనేక ముస్లిం సంస్థలు ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ శనివారం ఆరోపించింది. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, సుప్రీంకోర్టుని కోరింది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యకర్త మౌలానా సజ్జాద్ నోమాని మహారాష్ట్రలో మహా వికాస్…
PM Modi : మహారాష్ట్రలోని అకోలాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో ఎన్నికల పేరుతో కర్ణాటకలో వసూళ్లు రెట్టింపయ్యాయని ప్రధాని మోడీ అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయని, కర్ణాటకలో కోలుకుంటున్నారని ప్రధాని మోడీ అన్నారు. కర్ణాటకలో మద్యం దుకాణదారుల నుంచి రూ.700 కోట్లు రికవరీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఏర్పడితే ఆ రాష్ట్రం కాంగ్రెస్ రాజకుటుంబానికి ఏటీఎంగా మారుతుందని ప్రధాని మోడీ అన్నారు. ప్రస్తుతం…