Supriya Sule: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే ఓటేసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తాను అక్రమ బిట్‌కాయిన్ లావాదేవీలకు పాల్పడినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను తప్పుబట్టింది. బిట్ కాయిన్ల గురించి ప్రచారంలో ఉన్న వాయిస్ నోట్స్, సందేశాలన్నీ నకిలీవి, అది తన వాయిస్ కాదన్నారు. కావాలనే భారతీయ జనతా పార్టీ ఎంపీ సుధాంశు త్రివేది తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి పోలీసులు తనను అరెస్టు చేయరనే నమ్మకం ఉంది.. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్‌కు కంప్లైంట్ చేసినట్లు పేర్కొంది. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు గానూ ఎంపీ సుధాంశు త్రివేదికి పరువునష్టం దావా నోటీసులు పంపినట్లు సుప్రియా సూలే తెలిపింది.
Read Also: AUS vs IND: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. కెప్టెన్ బుమ్రా ఓటు ఆ ఇద్దరికే! తుది జట్టు ఇదే
కాగా, ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మాట్లాడుతూ.. తన సోదరి సుప్రియా వాయిస్ ఎలా ఉంటుందో తనకు తెలుసు.. ఆడియో క్లిప్‌లలో వారి వాయిస్ డబ్బింగ్ చేసినట్లుగా లేదు.. దీనిపై ఎంక్వైరీకి చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ తన కుమార్తెకు మద్దతుగా.. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం బీజేపీకి సాధ్యం అవుతుందని విమర్శించారు. మంగళవారం ఓ విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది పలు ఆడియో క్లిప్‌లను రిలీజ్ చేశారు.. సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, మాజీ పోలీసు కమిషనర్, ఇతరులతో కలిసి అక్రమ బిట్‌కాయిన్ లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు గుప్పించారు. మాజీ పోలీసు అధికారి, డీలర్‌కు మధ్య జరిగిన చాట్‌ల స్క్రీన్‌షాట్‌లను కూడా మీడియాతో పంచుకున్నారు.