POK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) హింసాత్మక ఆందోళనలు జరిగిన కొన్ని వారాల తర్వాత, మరోసారి నిరసనలు మొదలయ్యాయి. ఈసారి జెన్-Z నేతృత్వం నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థులు విద్యా సంస్కరణలపై, పెరుగుతున్న ఫీజులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు.
PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ప్రజలు తమ హక్కుల కోసం నినదిస్తున్నారు. గత వారం రోజులుగా పీఓకేలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ నిరసనల్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీని ఉపయోగిస్తోంది. ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 15 మంది మరణించినట్లు తెలుస్తోంది.
Pok Protests: పాకిస్తాన్ ఆర్మీ, భద్రతా బలగాలు అరాచకానికి పాల్పడుతున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జరుగుతున్న నిరసనల్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడి ఆర్మీకి వ్యతిరేకంగా పీఓకేలోని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు.
PoK Protests: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పినట్లు కనిపిస్తుంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పాలకులు ఇంటర్నెట్‌ను నిలిపి వేయడంతో పాటు అన్ని రవాణా మార్గాలను బంద్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అక్కడి జనం సోమవారం నుంచి నిరసనలు చేస్తున్నారు. మంగళవారం కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. పాక్ పోలీసులు నిరసనకారులను అదుపు చేయడానికి కాల్పులు జరపగా.. ఇందులో ఇద్దరు స్థానిక పౌరులు…