Muzaffarnagar: ఫేస్‌బుక్‌లో ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో ఉన్న బుధానా పట్టణంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిఖిల్ త్యాగి అనే యువకుడు చేసిన ఈ వ్యాఖ్యతో ఆగ్రహించిన ముస్లిం సంఘాలు వేలాదిగా వీధుల్లోకి రావడంతో పెద్ద దుమారం మొదలైంది. ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీ బలగాలను మోహరించారు. అంతేకాకుండా జిల్లా ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. T20 Emerging Asia…