శేషశైలవాసుని మురిపించిన స్వరకర్త … పార్వతీవల్లభుని పరవశింప చేసిన బాణీలు… చంద్రకళాధరి ఈశ్వరినే ప్రసన్నం చేసుకున్న సంగీతనిధి పెండ్యాల నాగేశ్వరరావు. చిగురాకులలో చిలకమ్మలకు సైతం పాట నేర్పిన బాట ఆయనది. వెన్నెల రాజులనే పులకింపచేసిన స్వరకేళి ఆయన సొంతం} ఆయన పంచిన మధురం మరపురానిది- మరువలేనిది. పెండ్యాల వారి మది శారదాదేవి మందిరం. ఆ విద్యల తల్లి అనుగ్రహంతోనే పెండ్యాల సంగీతం పండిత పామరభేదం లేకుండా అందరినీ అలరించింది. ఈ నాటికీ అలరిస్తూనే ఉంది. పెండ్యాల నాగేశ్వరరావు…
తెలుగునాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి, మళయాళ సీమలో తన స్వరవిన్యాసాలతో ఆకట్టుకున్న ఘనుడు మన విద్యాసాగర్. మాతృభాషలో కన్నా మిన్నగా పరభాషల్లోనే పదనిసలు పలికించి, పులకింప చేశారాయన. విద్యాసాగర్ పరభాషల్లో పలికించిన స్వరాలను మన తెలుగువారు కాపీ చేసిన సందర్భాలూ ఉన్నాయి. కళలకాణాచిగా పేరొందిన విజయనగరంలో రామచంద్రరావు అనే సంగీతకళాకారుని తనయునిగా 1963 మార్చి 2న జన్మించారు విద్యాసాగర్. తండ్రి వద్దనే కర్ణాటక సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న విద్యాసాగర్ తరువాత ఇతర గురువుల వద్ద మరింత సాధన…
తెలుగు చిత్రసీమలో దర్శకత్వంతో పాటు సంగీతం సమకూర్చిన వారూ ఉన్నారు. ఇక నిర్మాణంతో కూడా స్వరాలు పలికించి రంజింప చేసిన వారు అరుదనే చెప్పాలి. వారిలో అగ్రస్థానంలో నిలుస్తారు పెనుపాత్రుని ఆదినారాయణ రావు. ఆదినారాయణరావు నిర్మాతగా మారకపోయి ఉంటే, మరింత మధురాతి మధురమైన సంగీతం మన సొంతమయ్యేదని సంగీతప్రియులు అంటారు. ఆయన బాణీల్లో అంతటి మహత్తుండేది మరి. తన భార్య నటి అంజలీదేవి పేరుమీద ‘అంజలీ పిక్చర్స్’ సంస్థనూ స్థాపించి మరపురాని చిత్రాలను నిర్మించారు ఆదినారాయణరావు. ఆదినారాయణరావు…
మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ కైతప్రమ్ విశ్వనాథన్ నంబూద్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో భాదపడుతున్న ఆయన చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రాంతీయ పాఠశాలలో మ్యూజిక్ టీచర్గా కెరీర్ ప్రారంభించిన విశ్వనాథన్ దాదాపు 20 సినిమాలకు సంగీత దర్శకులుగా పనిచేశారు. ఆయన సంగీతం అందించిన ‘కన్నకి’ చిత్రానికిగానూ కేరళ రాష్ట్ర అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. విశ్వనాథన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు…
నవతరం కథానాయకుల తకధిమితైలకు సరితూగేలా సరిగమలు పలికిస్తున్నారు థమన్. టాప్ స్టార్స్ సినిమాల్లోనూ థమన్ పదనిసలు పరమానందం పంచుతున్నాయి. నేటి బిజీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ పేరు ముందుగా వినిపిస్తుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ థమన్ బాణీలతో సావాసం చేయాలని తపిస్తున్నారు. వారి ఇమేజ్ కు తగ్గ స్వరకల్పన చేయడంలో థమన్ బిజీ బిజీగా సాగుతున్నారు. తెలుగు సినిమా రంగం చూసిన చివరి బ్లాక్ బస్టర్ ఏది అంటే ‘అల…వైకుంఠపురములో’ పేరే వినిపిస్తుంది. 2020…
చూడటానికి చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు కానీ సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్ కు 30 సంవత్సరాలు. అయితే ఇరవై, ఇరవై రెండేళ్ళలోనే సంగీత దర్శకుడిగా మారేసరికీ అంతా అతని పాటల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. పైగా తొలిచిత్రం ‘3’లోని కొలవరి డీ పాటతో జాతీయ స్థాయిలో అనిరుథ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలం క్రితమే అతను తెలుగులోనూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కొందరు జోస్యం చెప్పారు. ఆ నేపథ్యంలో అనిరుథ్ సంగీతం సమకూర్చిన తొలి తెలుగు సినిమా…
సరిగమలతో సావాసం చేస్తూ, పదనిసలతో పయనించాలని చక్రి బాల్యం నుంచీ తపించారు. అందుకు తగ్గట్టుగానే తండ్రి సహకారంతో కాసింత సంగీతం నేర్చి, ఆ పై సాధనతో పట్టు సాధించారు. ఆరంభంలో ఓ ఆల్బమ్ తయారు చేసి, తన బాణీలు వినిండి అంటూ సినిమా రంగంలో తిరగసాగారు చక్రి. అప్పుడు ఈ పోరడు ఏం సంగీతం చేయగలడు అని పెదవి విరిచినవారే అధికం! అయితే ఆ పోరడు బాణీలతో ఆడుకొనే వీరుడు అని కొందరు అభిరుచిగల సినీజనం భావించారు.…