రేణుకాస్వామి హత్యకేసులో ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. అంతేకాకుండా.. వారిపై హత్యానేరం ఎత్తివేసింది. నిందితుడు కేశవ్ మూర్తికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నిందితులు కార్తీక్, నిఖిల్‌లకు కూడా బెంగళూరు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పసుపు పారాణి ఆరకముందే.. ఓ నవ వధువు దారుణ హత్యకు గురైనట్టు కటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా నిండక ముందే.. భర్త తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. నవ వధువు గొంతు నులిమి, చెవిపై బలంగా కొట్టడంతోనే రక్తం కారి చనిపోయిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు.. హైదరాబాద్ జరిగిన ఈ ఘటనపై అమలాపురంలోని భర్త ఇంటి ముందు మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. భర్త, అతని కుటుంబ సభ్యులపై చర్యలు…
Karnataka: కర్ణాటకలో బీదర్‌లో 18 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. బాధిత యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నగరవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసుకి సంబంధించి పోలీసులకు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. యువతి ఆగస్టు 29న తప్పిపోయింది, సెప్టెంబర్ 01న గుణతీర్థవాడిలోని ప్రభుత్వ పాఠశాలకు సమీపంలోని పొదల్లో ఆమె మృతదేహం లభించింది.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తండ్రి ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను బాధ్యులను చేస్తూ.. డ్యూటీలో ఉన్న అమ్మాయికి ఇలాంటివి జరిగితే పూర్తి బాధ్యత ఆస్పత్రిదే అన్నారు.
సినిమా ఆర్టిస్టు హత్యకు గురయ్యారు. ఆర్టిస్ట్ ని చంపేసి ఆత్మహత్యగా భర్త చిత్రీకరించే ప్రయత్నం చేశారు చివరికి కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.. జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ ను హత్య భర్త చేసి పారిపోయాడు. పరారీలో భర్త శివరామయ్య కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసిన 36 సంవత్సరాల మహిళను అతని భర్త గొంతు నులిమి చంపాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మల్లికార్జున కాలనీకి…
ఉత్తరాఖండ్ లో జరిగిన అత్యాచారం, హత్య ఘటననను పోలీసులు చేధించారు. అదృశ్యమైన 33 ఏళ్ల నర్సుపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ధర్మేందను బుధవారం అరెస్టు చేశారు. ఈ ఘటన ఉధమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రాపూర్‌లో జూలై 30న జరిగింది.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం అవుతుందని చూపించేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత. కర్నూలులో టీడీపీ నేత హత్య కేసులో నిందితులు ఎంతటి వారైన కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆయా రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు విధులు బహిష్కరించి ఆందోళనలు చేపడుతున్నారు. ఇక కోల్‌కతాలో ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా సేవలు బంద్ చేసి వైద్యులు, నర్సులు ఆందోళనకు దిగారు.
కోల్కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి 14 రోజులు పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. బీఎన్ఎస్ సెక్షన్లు 64 (అత్యాచారం), 103 (హత్య) కింద అభియోగాలు నమోదయ్యాయి.