తిరుపతి జిల్లా వడమాలపేటలో హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. అనంతరం వారికి.. పది లక్షల చెక్కును అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చిన్నారిపై అఘాయిత్యం బాదేసింది.. చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం చేసి హత్య చేయడం మరింత బాధించిందని తెలిపారు. అలిమేలు మంగాపురం ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్యపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సొంత అనుచరుడు హత్యకు గురి కావడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్థాపానికి గురి అయ్యారు.. జీవన్ రెడ్డి బాధలో ఉండి అలా మాట్లాడారని తెలిపారు. తాను జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడనని.. పోలీసులతో మాట్లాడినట్లు చెప్పారు. హత్య చేసిన నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.. హత్యపై విచారణ చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని పోలీసులకు చెప్పానన్నారు.
Baba Siddique Murder: అజిత్ వర్గం నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో ముంబై పోలీసులు మూడో అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నాయకుడిని హత్య చేసినందుకు బాధ్యత వహిస్తూ పోస్ట్ చేసిన శుభం సోంకర్ సోదరుడు ప్రవీణ్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. పుణెకు చెందిన 28 ఏళ్ల ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మారణకాండలో ముగ్గురిలో ఇద్దరు షూటర్లకు ప్రవీణ్, అతని సోదరుడు సహకరించారని సమాచారం. ప్రవీణ్ సోదరుడు శుభం…
Murder In Hyderabad: బుధవారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ పాతబస్తీలో యువకుడు దారుణ హత్య జరిగింది. హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా నగర్ వట్టే పల్లి వద్ద సాజిద్ అనే వ్యక్తిని తన ఇంటి వద్ద పాత కక్షలతో కత్తులతో దాడి చేసి హత్య చేసాడు సిద్దిక్ అనే వ్యక్తి. విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు.. ఆ తరవాత సంఘటన స్థలం చేరుకున్నారు. పోలీసులు సాజిద్ ని ఆసుపత్రికి తరలించగా…
బెంగళూరులో రిఫ్రిజిరేటర్‌లో ముక్కలు ముక్కలుగా నరికి మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడి నుండి పోలీసులు డెత్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో అతను ఆత్మరక్షణ కోసం చంపినట్లు రాశాడని తెలిపారు. బెంగళూరులోని వయాలికావల్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో మహాలక్ష్మి మృతదేహాన్ని 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచాడు నిందితుడు ముక్తి రంజన్ రాయ్.. కాగా.. హత్య అనంతరం సెప్టెంబర్ 25 న ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చెట్టుకు ఉరివేసుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
తెనాలిలో జరిగిన, ఓ హత్య కేసు సంచలనం కలిగించింది.. ఎందుకంటే హత్యకు గురైన వ్యక్తి, గతంలో సెలబ్రిటీల వద్ద బౌన్సర్ గా పని చేసాడు.. అలాంటి బౌన్సర్‌ను హత్య చేశారంటే ఏం జరిగిందో అన్న ఆసక్తి ప్రజల్లో ఉంటే, పోలీసులకు మాత్రం టెన్షన్ పట్టుకుంది.. ఈ హత్య కేసు ఏమయింటుందో , ఎంతమంది హత్య చేసి ఉంటారో, మరి ఎంతమంది ప్లాన్ చేసి ఉంటారు,అని పోలీసులు అలర్ట్ అయిపోయారు... తీరా హత్య కేసు ను ఆరా తీసిన…
Shocking: పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. తాను ఇష్టపడిన అబ్బాయితో పెళ్లికి అడ్డు చెబుతున్నారని ఓ యువతి ఏకంగా మొత్తం కుటుంబాన్నే కడతేర్చింది. ఈ ఘటన సింధ్ ప్రావిన్సులోని ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న చోటు చేసుకుంది. తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతోనే ప్రియుడితో కలిసి యువతి కుట్ర పన్నింది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఎంపీ వైద్యుడి భార్య దారుణంగా హత్యకు గురైంది. ఆర్ఎంపీ వైద్యుడి భార్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.