Teen Student Murdered By Girlfriend's Ex: ప్రేమ వ్యవహారాలు హత్యలకు దారి తీస్తున్నాయి. బిజీ రోడ్డుపైనే ఓ అమ్మాయి మాజీ లవర్ మరో వ్యక్తిని హత్య చేశాడు. ఇది ముంబై మహానగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గురువారం సాయంత్రం ముంబైలో బిజీగా ఉన్న ఓ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు 19 ఏళ్ల కాలేజీ స్టూడెంట్ ను పొడిచి చంపారు. చనిపోయిన వ్యక్తిని చెంబూరు ప్రాంతానికి చెందిన ముఖ్తార్ షేక్ గా గుర్తించారు పోలీసులు.