గత నెల 25న జరిగిన హత్యకేసును శ్రీకాకుళం పోలీసులు చేధించారు. శ్రీకాకుళం టౌన్ సమీపంలోని విజయాదిత్య పార్క్ లో హత్యకు గురయ్యాడు మాజీ ఆర్మీ ఉద్యోగి చౌదరి మల్లేశ్వరరావు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విభేదాలే హత్యకు కారణమని తేల్చారు పోలీసులు. మల్లేశ్వరరావును హతమార్చాడు సొంత బావమరిది సీపాన అప్పలనాయుడు. విజయాదిత్య పార్క్ కు పిలిపించి మరో ఐదుగురితో కలిసి హత్య చేసాడు అప్పలనాయుడు. ఈ హత్యకు ఆరులక్షల ఒప్పందం చేసాడు. ముందుగా 4 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు.…
వైఎస్ వివేకా హత్య కేసులో 15వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. దీంతో ఇవాళ ఈ కేసులో ఆరుగురు అనుమానితులు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. అటు వరుసగా 5వ రోజు సీబీఐ విచారణకు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి హాజరయ్యారు. పులివెందులకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హాజరు కావడం విశేషం. ఎర్ర గంగిరెడ్డితో పాటు పులివెందులలో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు కృష్ణయ్య, సావిత్రి, కుమారులు సునీల్ యాదవ్, కిరణ్ కుమార్…
వైఎస్ వివేకా హత్య కేసులో పదో రోజు సిబిఐ విచారణ కొనసాగుతుంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ విచారణ జరుగుతుంది. ఈరోజు తాజాగా ముగ్గురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు. చిట్వేలి మండలానికి చెందిన వైకాపా కార్యకర్తలు లక్ష్మీ రంగా, రమణను ప్రశ్నిస్తున్న సిబిఐ అధికారులు… వారితో పాటు సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన జగదీశ్వర్రెడ్డిని ప్రశ్నించారు సీబీఐ అధికారులు. గతంలో వివేకా దగ్గర జగదీశ్వర్ రెడ్డి పీఏగా పనిచేసాడు. అయితే చూడాలి మరి…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి వేగం పెంచింది..విచారణలో భాగంగా పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వివేకా సన్నిహితులతో పాటు కీలక వ్యక్తులను విచారణ చేశారు…గతంలో సీబీఐ బృందంలో పలువురికి కరోనా సోకడంతో మధ్యలో విచారణకు బ్రేక్ పడింది..అంతేగాకుండా వివేకా కూతురు సునీత ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం కేసులో మరింత వేగం పెంచారు..సీబీఐ విచారణలో భాగంగా పులివెందులకు చెందిన పలువురు కీలక వ్యక్తులను విచారణ చేసి హత్య జరిగిన ప్రదేశాన్ని…