2018 తెలంగాణ, ఒరిస్సా సరిహద్దులో జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018లో తెలంగాణ, ఒరిస్సా సరిహద్దు చర్ల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ పూర్తి అయింది. ఈ ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టుల మృతి చెందిన సంగతి తెలిసిందే. బూటకపు ఎన్ కౌంటర్ అంటూ ప్రజా హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేశాయి.
చనిపోయినవారికి రీ పోస్టుమార్టం, పోలీసులపై హత్యా నేరం కింద కేసు పెట్టాలని హైకోర్టును కోరారరు పిటిషనర్లు. చనిపోయిన వారికి రీ పోస్టుమార్టం, హత్యానేరం కింద కేసులు నమోదు చేశామని హైకోర్టుకు తెలిపారు పోలీసుల తరపు న్యాయవాది. పిటిషనర్ కోరిన విధంగా రీ పోస్టుమార్టం, హత్యానేరం కింద కేసు నమోదు చేశారు కాబట్టి… తదుపరి ఎలాంటి విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది హైకోర్టు ధర్మాసనం. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన 3 నెలల లోపు ఎన్ కౌంటర్ కు సంబంధించిన దర్యాప్తు పూర్తి చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.