Revanth Reddy: 1980 లో పుట్టిన బీజేపీ అయినా… 2001 లో పుట్టిన టీఆర్‌ఎస్ అయినా మమ్మల్ని పొగిడి తీరాల్సిందే.. చరిత్ర ఉన్నది మాకే అన్నారు రేవంత్ రెడ్డి. ట్విట్టర్ టిల్లు పొగిడింది కూడా అందుకే అని విమర్శించారు. పరేడ్ గ్రౌండ్ లో కేంద్రం అధికారిక వేడుక కాదు.. కేవలం టూరిజం శాఖ మాత్రమే చేస్తుందని అన్నారు. కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చిందా..? అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి ఇదో ప్రయత్నం అని రేవంత్ విమర్శించారు.…
అందరిలోనూ ఆసక్తి రేపుతున్న నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ భారీ కసరత్తు ఫలించింది. ఇవాళ మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి పేరును కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఎంపికచేసింది. ఢిల్లీకి రాష్ట్ర పీసీసీ నాలుగు పేర్లు పంపించింది. పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాస్ నేతలు మునుగోడు టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే వీరిలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాబట్టి అధిష్టానం…
చౌటుప్పల్ వరదలతో మునిగిపోతుంటే సిద్దిపేట సిరిసిల్లలో అభివృద్ధి చేస్తున్నారు దీనిని సమానత్వం అంటారా అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. కొన్ని నెలలుగా తమ సమస్యలను పరిష్కరించాలని 23 వేల మంది వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే కేసీఆర్ కు కళ్ళు మూసుకుపోయాయా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల…
అమ్ముడుపోయిన ప్రతివాడు సిద్ధాంతాలు చెప్పడం ఫ్యాషన్ గా మారిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ తీవ్రంగా విమర్శించారు. యాదాద్రి జిల్లాలో పాదయాత్ర సంర్భంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టంలో ప్రజలు మునుగోడు వైపు చూస్తున్నారని తెలిపారు. సాయుద పోరాటానికి మునుగోడు చిరునామా అని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల పాత్ర కీలకంమని, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ వివక్షకు గురవుతుందని అన్నారు. కేసిఆర్ మునుగోడు సమస్యలకు పరిష్కారం చూపలేదని గుర్తుచేశారు. పోడుభూముల సమస్య పరిష్కారం…
Union Minister Kishan Reddy in Munugodu: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తోన్న మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నేడు మునుగోడుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయలుదేరనున్నారు. రేపు అమిత్ షా భారీ బహిరంగ సభ నేపథ్యంలో మునుగోడుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. రేపు జరగబోయే బీజేపీ భారీ బహిరంగ సభా స్థలిని పరిశీలించనున్నారు. సభలో జనసమీకరణపై పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేసే అవకాశం. ఇవాళ ఉదయం 11 గంటకు మనుగోడు…