మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది.. దీంతో ప్రధాన పార్టీలు గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.. ఆరోపణలు, విమర్శలు ఎలా ఉన్నా.. మద్యం ఏరులైపారుతోంది.. ఓటర్లను డబ్బులు ఆశచూపి ఆకట్టుకుంటున్నారు.. మూడు ప్రధాన పార్టీలు.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి.. ఇక, బీఎస్పీ, కోదండరాం పార్టీ, ప్రజాశాంతి పార్టీ, కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.. అయితే, ఫైనల్‌గా మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీదే…
మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాకరేపుతోంది.. ఏ పార్టీ ఇస్తుంది.. ఏ పార్టీ పంచుతుంది అనే విషయం పక్కన పెడితే.. మద్యం ఏరులైపారుతోంది.. ఇక డబ్బులు వెదజల్లుతున్నాయి ఆయా పార్టీలు.. ఈ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు… ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి కాకుండా కార్పొరేట్ శక్తులకు కాపలాదారుడు అయ్యాడని ఆరోపించిన ఆయన.. ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయి..…
మునుగోడు ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. గెలిచేందుకు ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం మరింత హీటెక్కింది. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే! స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ధర్మానికి, న్యాయానికి,అన్యాయానికి,అక్రమాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలె మునుగోడు ఉప ఎన్నికలు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మునుగోడుల్లో టీఆర్ఎస్ కోట్లు కుమ్మరించినా, వారి బలం పెరగడం లేదన్నారు.