నరేంద్ర మోడీని ఎదిరించే దమ్మున్న మొనగాడు కేసీఆర్ ఒక్కరే అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీజేపీని హెచ్చరించారు. అందుకే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని మంత్రి అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక సమీపించేకొద్దీ మద్యం వెల్లువెత్తుతోంది. దీంతో.. ప్రజలను ఆకట్టుకునేందుకు కోళ్లు, మేకల తలలు తెగిపడుతున్నాయి.. తాగినోళ్లకు తాగినంత, తిన్నోళ్లకు తిన్నంతగా ప్రధాన పార్టీల నిత్య విందులు సాగుతున్నాయి.
తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు హాట్ టాపిక్. ఉప ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులు మిగిలి ఉంది. దీంతో.. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు వేగం పెంచాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ అయితే మంత్రులను, ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నాలు వేగవంతం చేసింది.