తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి… శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతోపాటు మొత్తం వంద మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజున వందకుపైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో ఎక్కువగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. 141 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. శని, ఆదివారాల్లో నామినేషన్ల…