కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీహెచ్ ఇంట్లో భేటీకి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కీలక నేతలు హాజరయ్యారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్ లో మున్నూరు కాపు ప్లీనరి సన్నాహక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి గంగుల కమలాకర్ పాల్గొనగా.. ఎంపీ రవిచంద్ర, కాంగ్రెస్ నేత వీహెచ్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బొంతు రామ్మోహన్, మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.