ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వర్కర్లకు తీపికబురును అందించింది. మున్సిపల్ శాఖలో అవుట్‌సోర్సింగ్ నాన్- పీ హెచ్ వర్కర్ల వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేటగిరి 1 వర్కర్ల వేతనం రూ.21,500 నుంచి రూ.24,500 కు పెంచింది. కేటగిరీ 2 వర్కర్ల వేతనం రూ.18500 నుంచి రూ.21500 కు పెంపు, కేటగిరి 3 వర్కర్ల వేతనం రూ.15000 నుంచి 18500 కు పెంచుతూ నిర్ణయించింది. తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కు…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మున్సిపల్ శాఖపై సమీక్ష సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు..
రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా ఉన్న చెత్త తొలగింపు ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి.. చెత్త తొలగించని కారణంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త మిగిలిందని.. దీన్ని వచ్చే జూన్ నాటికి పూర్తిగా తొలగించాలని సీఎం సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఐదేళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు ప్రారంభంకానున్నాయి. గతంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ మేరకు సమాచారం అందించారు. రాబోయే మూడు వారాల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే.
అర్హులైన లబ్ధిదారులకు 6 గ్యారంటీ పథకాలు ద్వారా లబ్ది పొందేందుకు వార్డులో ఏర్పాటు చేసిన కౌంటర్ లకు వచ్చి తమ విన్నపాలను అందించేందుకు షెడ్యూల్డ్ సమాచారాన్ని తప్పని సరిగా చేరేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ తెలిపారు.
వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించారు. మ్యాన్‌హోల్స్, నాలాలు, వరదనీటి కాలువల వల్ల గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
మున్సిపల్ శాఖలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది టీఎస్‌పీఎస్సీ... మొత్తంగా 175 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది...
తెలంగాణ పురపాలక శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. శంకరయ్య కమిషనర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కు వెళ్లగా… సి హెచ్ నాగేశ్వర్ కమిషనర్ మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్.. రామకృష్ణ రావు కమిషనర్ ఫిర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్… రవిందర్ సాగర్ కమిషనర్ మిర్యాలగూడ మునిసిపాలిటి… బి సత్యనారాయణరెడ్డి మేడ్చల్ మునిసిపాలిటీ నుండి నిర్మల్ మునిసిపాలిటీ కమిషనర్ గా బదిలీ అయ్యారు. ఇక ఎస్ వి జానకి రామ్ సాగర్ గద్వాల్ మునిసిపాలిటీ కమిషనర్ గా… జయంత్ కుమార్ రెడ్డి…