ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వర్కర్లకు తీపికబురును అందించింది. మున్సిపల్ శాఖలో అవుట్‌సోర్సింగ్ నాన్- పీ హెచ్ వర్కర్ల వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేటగిరి 1 వర్కర్ల వేతనం రూ.21,500 నుంచి రూ.24,500 కు పెంచింది. కేటగిరీ 2 వర్కర్ల వేతనం రూ.18500 నుంచి రూ.21500 కు పెంపు, కేటగిరి 3 వర్కర్ల వేతనం రూ.15000 నుంచి 18500 కు పెంచుతూ నిర్ణయించింది. తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.