మరోసారి అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ పెరిగింది.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా భూమిలో అడుగుపెడితే ఊరంతా తిప్పుతూ చెప్పుతో కొట్టానంటూ గతంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జేసీ ప్రభాకర్‌రెడ్డి..
తాడిపత్రి అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం.. ప్రజలు తమ బంధువులు.. స్నేహితులు సహకరించాలని చేతులు జోడించి విన్నవించారు. ఇక, తాడిపత్రి చుట్టుపక్కల ఉన్న బైపాస్ రోడ్లలో చెత్తవేస్తే కేసులు నమోదు చేస్తామంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
రిపబ్లిక్ డే రోజు జాయ్ పార్క్‌లో జాతీయ పతాకం ఎగురవేయవద్దని అధికారులను బెదిరించడం సరికాదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము నిర్మించి జాయ్ పార్క్‌కు రిజిస్ట్రేషన్ ఉంది మీరు నిర్మిస్తున్న పార్క్‌కు రిజిస్ట్రేషన్ ఉందా అని ప్రశ్నించారు. అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశానికి వెళ్లవద్దని అధికారులను బెదిరింపులకు గురిచేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని తాడిపత్రి అభివృద్ధి కోసం ప్రయత్నిస్తే సహకరిస్తామన్నారు.…
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హీట్ పెంచుతోంది పొలిటికల్ ఫైట్… మరోసారి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిగా మారింది పరిస్థితి… ప్రతీ విషయంలోనూ ఈ ఇద్దరు నేతల మధ్య యుద్ధమే నడుస్తుండగా.. తాజాగా.. మరో వివాదం చోటు చేసుకుంది.. ఇవాళ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడానికి వెళ్లారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి… ఇదే సమయంలో మున్సిపల్ అధికారులను, సిబ్బందిని తీసుకుని నగరంలో పర్యటించారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. దీంతో.. అధికారులు,…