Laila Khan Murder Case: 13 ఏళ్ల క్రితం సంచలన సృష్టించిన బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమె సవతి తండ్రికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అభిమానులకు శుభవార్త. కింగ్ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా నటుడు నిన్న (బుధవారం) మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరారు. షారుక్‌ను అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చేర్చారు.
మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థానేలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి.
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు ముంబైకు తీసుకెళ్లారు. పోలీసుల కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ను ముంబైకి తరలించారు.
Flamingos Dead: ఎమిరేట్స్ విమానం ఢీకొట్టడంతో ముంబైలో సోమవారం 36 ఫ్లెమింగో పక్షలు చనిపోయాయి. ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కి కొన్ని నిమిషాల ముందు పక్షుల గుంపును విమానం ఢీకొన్నట్లు తెలుస్తోంది.
Ratan Tata: ముంబైలోని అన్ని నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబై వాసులకు కీలక విజ్ఞప్తి చేశారు. ముంబై వాసులంతా బాధ్యతతో ఓటేయాలని కోరారు.
Fake Notes : మహారాష్ట్రలోని థానేకు చెందిన పోలీసులు నకిలీ నోట్లను ముద్రిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ నుండి నకిలీ డబ్బు ప్రింట్ చేయడం నేర్చుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. 16 మంది ప్రాణాలను బలిగొన్న ఆ హోర్డింగ్ పెట్టింది ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని భవేశ్ భిండే 3 రోజులు మూడు రాష్ట్రాలు తిరిగాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ముప్పుతిప్పలు పడ్డాడు.
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు.