Abhishek Bachchan Buy 6 Flats: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. ముంబైలోని బోరివలిలో ఆరు లగ్జరీ ఫ్లాట్స్ కొన్నారు. ఈ ఫ్యాట్స్ ఒబెరాయ్ స్కై సిటీలో ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ ధర రూ.15.42 కోట్లు అని సమాచారం. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. అభిషేక్ ఏకంగా ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేయడంతో అందరూ అవాక్కవుతున్నారు. ఒక్కసారే అన్ని ఫ్లాట్స్ ఎందుకు కొన్నారు? అని ఆలోచనలో పడ్డారు.
బొరివాలి సబ్బరన్ ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒబెరాయ్ స్కై సిటీకి చెందిన అపార్ట్‌మెంట్‌లో అభిషేక్ బచ్చన్ ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. ఇవన్నీ 57వ అంతస్థులోనే ఉన్నాయి. ఇందులో రెండు ఫ్లాట్స్ ధర చెరో రూ.79 లక్షలు. మిగిలిన నాలుగు ఫ్లాట్లలో ఒక్కోటి దాదాపుగా రూ.3.5 కోట్లుగా ఉంది. మొత్తంగా ఈ ఆరు ఫ్లాట్స్ ధర రూ.15.42 కోట్లు. మే 5న అమ్మకపు ఒప్పందం కుదరగా.. 29న రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలుస్తోంది.
Also Read: Kamal Haasan: ఆ సినిమా టికెట్ కోసం కొన్ని వారాల పాటు ఎదురు చూశా!
ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ తన సతీమణి ఐశ్వర్య రాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి ముంబైలోని జల్సాలో నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్‌లతోనే అభిషేక్ ఫామిలీ ఉంటోంది. అమితాబ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్ కెరీర్ అనుకున్నంత రేంజుకి వెళ్లలేదు. ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత.. అడపాదడపా హిట్స్ కొడుతూ వ్యాపారాల్లో బిజీ అయ్యారు. కబడ్డీ ప్రీమియర్ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ టీమ్ ఉంది.