Mumbai: ఆఫిస్ కి ఆలస్యంగా వస్తే రూ.200 జరిమానా..ఐదు సార్లు పెనాల్టీ కట్టిన కంపెనీ వ్యవస్థాపకుడు
- ఉద్యోగులు 9.30 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలని నియమం
- వారం రోజుల్లో అయిదు సార్లు లేట్ గా వచ్చిన వ్యవస్థాపకుడు
- తన అనుభవాన్ని ఎక్స్ లో పంచుకున్న సీఈవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైకి చెందిన బ్యూటీ స్టార్టప్ బ్రాండ్ వ్యవస్థాపకుడు శల్ షా ఇటీవల ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఉత్పాదకతను పెంపొందించేందుకు కఠినమైన నియమాన్ని ప్రవేశపెట్టారు. షా తన సిబ్బందిని ఉదయం 9.30 గంటలకు కార్యాలయానికి చేరుకోవడం తప్పనిసరి చేశారు. ఎవరైనా ఆలస్యంగా వస్తే.. రూ.200 జరిమానా విధించారు. దురదృష్టవశాత్తూ కొత్త నియమంతో ఆయనకే ఎదురుదెబ్బ తగిలింది. వారంలోపు కౌశల్ కార్యాలయానికి అయిదు సార్లు ఆలస్యంగా వచ్చారు. దీంతో నియమం పెట్టిన వ్యక్తే రూ. 1,000 చెల్లించాల్సి వచ్చింది.
READ MORE: Mushrooms Benefits : పుట్టగొడుగులను మహిళలు ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ఎవోర్ బ్యూటీ వ్యవస్థాపకుడు కౌశల్ షా , సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ “ఎక్స్”లో తాను చెల్లించిన నగదుకు సంబంధించి స్ర్కీన్ షార్టు పోస్టు చేశారు. “కార్యాలయంలో ఉత్పాదకతను పెంచడానికి.. ప్రతి ఒక్కరూ ఉదయం 9:30 గంటలకు ఆఫీసులో ఉండాలని నేను కఠినమైన నియమం పెట్టాను. ఇంతకుముందు మేము 10-11 గంటలకు వచ్చేవాళ్లం. ఆలస్యంగా వచ్చిన వాళ్లు రూ. 200 జరిమానాగా చెల్లిస్తారు. ఇది నేను 5వ సారి చెల్లిస్తున్నాను.” అని రాసుకొచ్చారు. కాగా చాలా మంది నెటిజన్లు ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఆ ఖాతా ఎవరిదని వ్యాఖ్యానించారు. జరిమానాలను వసూలు చేయడానికి తాను ప్రత్యేక UPI లైట్ ఖాతాను సృష్టించినట్లు షా తెలిపారు. జరిమానా ద్వారా వచ్చిన డబ్బును పూర్తిగా జట్టు కార్యకలాపాలు, డైనింగ్, ఇతర టీమ్ ఈవెంట్‌ల వంటి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు వ్యవస్థాపకుడు పేర్కొన్నారు.
Last week,
To increase the productivity in office,
I made a strict rule for everyone to be in the office by 9:30 am (earlier we used to come by 10-11)
and if we‘re late, we pay Rs.200 as penalty.
This is me paying it for the 5th time🫠 pic.twitter.com/4qYi6kTP17
— Kaushal (@_kaushalshah) June 19, 2024
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!