Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగే కొద్దీ డొంక కదులుతోంది. 26/11 ముంబై దాడుల తరహాలో ఢిల్లీ వ్యాప్తంగా పలు ప్రధాన ప్రాంతాల్లో దాడుల చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయం వంటి ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ లో దాడులు చేయాలని…
Pakistan: పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ తన కొత్త పుస్తకంలో 26/11 ముంబై దాడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో శాంతిగా ఉండేందుకు జర్దారీ అంగీకరించడం, అణ్వాయుధాలపై ‘‘నో ఫస్ట్ యూజ్’’ అనే విధానాన్ని ప్రతిపాదించినందుకే దాడులు జరిగినట్లు చెప్పారు. 'ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బి టోల్డ్'లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌తో జరిగిన ఇంటర్వ్యూలో బాబర్ ఈ విషయాలు…
26/11 ముంబై దాడులకు పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రమేయం ఉందని ముంబై పేలుళ్ల కుట్రదారుడు తహవూర్ రాణా అంగీకరించాడు. తహవూర్ రాణాను అమెరికా.. భారత్‌కు అప్పగించింది. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. విచారణలో తహవూర్ రాణా సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం.
Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రదాడుల కీలక కుట్రదారు, ఉగ్రవాది అయిన పాక్-కెనెడియన్ తహవూర్ రాణాని భారత అధికారులు గురువారం అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. అమెరికా న్యాయస్థానాల్లో భారత్‌కి అప్పగించకుండా ఉండేందుకు అన్ని న్యాయ సదుపాయాలను రాణా ఉపయోగించుకున్నాడు.
Tahawwur Rana: 26/11 నిందితుడు, ఇండియా మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది తహవూర్ రాణా ఇండియాకు చేరుకున్నాడు. అమెరికా అత్యున్నత న్యాయస్థానాలు ఇండియాకు అప్పగించేందుకు అనుమతించడంతో, ఇతడిని భారత్ తీసుకువచ్చారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాడు. మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది కావడంతో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. పాలెం ఎయిర్ పోర్టు నుంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారని తెలుస్తోంది.
Hafiz Saeed: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ హతమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ జీలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన దాడుల్లో అతడి మేనల్లుడు అబూ ఖతత్ మరణించాడు. అయితే, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హఫీస్ సయీద్ రావల్పిండిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, చికిత్స తీసుకుంటూ మరణించినట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాని భారత్‌కి అప్పగించడంలో మరోసారి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా పర్యటన సమయంలో ట్రంప్ రాణాని భారత్‌కి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ఇరు దేశాలు చాటి చెప్పాయి. అయితే, పాక్-అమెరికన్ పౌరుడైన తహవ్వూర్ రాణా మరోసారి అమెరికా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. దీంతో భారత్‌కి అప్పగింత ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రమేయం ఉన్న పాకిస్థానీ సంతతికి చెందిన కెనడా వ్యాపారవేత్త తహవ్వూర్ రాణాను త్వరలో భారత్‌కు అప్పగించవచ్చు. రాణాను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ దౌత్య మార్గాల్లో సాగుతోంది. 2024 ఆగస్ట్‌లో.. రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం.. రాణాను భారత్‌కు అప్పగించవచ్చని యూఎస్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే భారత్‌కు తీసుకొచ్చి.. ఉరిశిక్ష…
S Jaishankar: 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అలాంటి సంఘటన ఇప్పుడు జరిగితే వేరేలా ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం చెప్పారు.