ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది.. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు.. 13 జిల్లాలుగా ఉన్న ఏపీ 26 జిల్లాలుగా పునర్విభజించనున్నారు.. ఆయా జిల్లాల పేర్లను కూడా ఖరారు చేశారు.. మరోవైపు.. ఇప్పటికే అనేక సమస్యలపై వరుసగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖలు రాస్తూ వస్తున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానాభం.. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలోనూ ఓ లేఖ రాశారు.. కొత్త జిల్లాలకు తాను సూచిస్తున్న మూడు పేర్లు పెట్టాలని ముద్రగడ విన్నవించారు.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక జిల్లాకు బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని కోరిన ఆయన.. రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, కోనసీమ జిల్లాకి లోక్ సభ మాజీ స్పీకర్ స్వర్గీయ బాలయోగి పేరు పెట్టాలని తన లేఖలో సూచించారు.. మూడు పేర్లు కొత్త జిల్లాలకు వచ్చేలా చూడాలని లేఖలో సీఎం వైఎస్ జగన్‌ని కోరారు ముద్రగడ్డ.
Read Also: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ముంబైలో కేసు నమోదు