ఏ విషయం గురించైనా కేసీఆర్ మాట్లాడగలరు. అది కూడా అనర్ఘళంగా.. గంటల సేపు అందరినీ టీవీల ముందు కట్టిపడేసి తన వాయిస్, తన ఛాయిస్ వినిపించగలరు. ఈమధ్యకాలంలో చినజీయర్ తో కేసీఆర్ కు గ్యాప్ బాగా వచ్చిందనే ప్రచారం సాగుతోంది. అయితే సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ స్పందించారు. చినజీయర్‌తో తనకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?. మీకు మీరు ఊహించుకుంటే ఎలా?. చినజీయర్‌తో గ్యాప్ పై స్పందించాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చేశారు.…
శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమంలో భాగంగా శనివారం 108 దివ్యదేశ మూర్తుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. వేలాదిమంది వీక్షించి తరించారు. ఈ విశిష్ట కార్యక్రమం గురించి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అద్భుతంగా వివరించారు. భగవంతుడు అనేక రూపాలలో అవతరిస్తూ సంచరిస్తుంటాడు. ఆలయాల్లో, ధ్యానం చేసేవారి మనసులలో భగవంతుడు కొలువై వుంటాడు. విగ్రహ రూపంలో ఆలయాల్లో వుండే రూపం మనకు కనిపిస్తుంది. అవతరాల్లో వుండే రూపం ఆయా కాలాల్లో కనిపిస్తుంది. వైకుంఠం…
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లక్షలాదిమంది భక్తుల రాకతో పులకించింది. అక్కడ ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహం కనులవిందుగా కనిపించింది. శ్రీరామనుజుల కీర్తి దశదిశలా మరోమారు వ్యాపించింది. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీరామనగరంలో 12 రోజుల పాటు జరిగిన మహా క్రతువులో వేలాది మంది రుత్వికులు.. లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అంకురార్పణ నుంచి మహా పూర్ణాహుతి వరకు నిత్యం ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. భారత దేశానికి చెందిన అతిరథ మహారథులు, రాజకీయ ప్రముఖులు సమతామూర్తిని…
ముచ్చింతల్ శ్రీరామనగరంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం వైభవంగా సాగుతోంది. ఇవాళ్టికి 13వ రోజుకి చేరింది. ఆదివారం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇవాళ పలు కార్యక్రమాలు జరగనున్నాయి. వేలాదిమంది భక్తులు తరలివస్తుండడంతో శ్రీరామనగరం భక్త జన సంద్రంగా మారింది.
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో వైభవంగా జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు పాల్గొన్నారు. ఈ మేరకు సమతా మూర్తి విగ్రహాన్ని వారు దర్శించుకున్నారు. అనంతరం శ్రీరామనగరంలో కొలువై ఉన్న 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నారు. ఆ తర్వాత భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఈ…
శ్రీ రామానుజ సహస్రాబ్దిలో పాల్గొన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. హైదరాబాద్ చేరుకున్న రామ్ నాథ్ కోవింద్ కు ఘన స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు స్వాగతం పలికారు గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్, మంత్రి తలసాని, మేయర్ విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి. రాష్ట్రపతిని శాలువాతో సన్మానించారు సీఎం కేసీఆర్.
బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతున్నట్టే.. మర్యాదల విషయంలోనూ అదే జరుగుతోంది. కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే తెలంగాణ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నాను. సమతామూర్తి కేంద్రం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. నా శాఖల పౌర సరఫరాలు, పర్యావరణ శాఖలకు సంబంధించి రివ్యూ చేశానన్నారు. ఈ రివ్యూకి అధికారులు మాత్రమే వచ్చారు. రాష్ట్ర మంత్రులు ఎవరూ సమీక్షకు హాజరు కాలేదు. నావిషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. అతిధి మర్యాద ఇవ్వలేదని విమర్శించారు.…