టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఊహించని షాక్ ఇచ్చాడు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన పోస్టులను డిలీట్ చేశాడు. దీంతో.. సీఎస్కేకి జడేజా గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు మరింత బలపడ్డాయి. నిజానికి.. చెన్నై జట్టుకి డెడికేటెడ్‌గా ఉన్న ఆటగాళ్లలో జడేజా ఒకడు. అతడు అత్యంత కీలకమైన ప్లేయర్ కూడా! ఒంటిచేత్తోనే ఆ జట్టుని ఎన్నోసార్లు ముందుకు నడిపించిన సందర్భాలున్నాయి. అలాంటి జడేనా.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.…
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈరోజు 41వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు సహచర ఆటగాళ్లు విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. ‘‘నీలాంటి నాయకుడు ఇంకెవరూ ఉండరు. భారత జట్టుకి నువ్వు అందించిన ఎనలేని సేవలకు ధన్యవాదాలు. నువ్వు నాకు పెద్దన్నలా మారావు. నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం ఎప్పుడూ అలాగే ఉంటాయి. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్’’ అంటూ కోహ్లీ ట్వీట్…
భారత్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి క్రేజ్, ఫాలోయింగ్ గడించిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే.. అది మహేంద్రసింగ్ ధోనీనే! టీమిండియాకు అతడు ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాడు. అతని సారథ్యంలోనే 28 ఏళ్ల తర్వాత భారత్ వరల్డ్ కప్ గెలిచింది. తొలి టీ20 వరల్డ్‌కప్‌ని కూడా కైవసం చేసుకుంది. కెప్టెన్ కూల్‌గా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. అందుకే.. అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ ఇతని ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు 7వ…
కొంతకాలం నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడంటూ విమర్శలు ఎదుర్కొన్న రిషభ్ పంత్.. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టేశాడు. వరుస వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు.. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. అదే జోష్‌ను రెండో ఇన్నింగ్స్‌లోనూ కొనసాగించాడు. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన రికార్డ్‌ని సాధించగలిగాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేసిన పంత్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 57 పరుగులు సాధించాడు. తద్వారా.. ఒకే టెస్టులో శతకం, అర్దశతకం సాధించిన…
కేవలం బ్యాట్‌తోనో, బంతితోనో కాదు.. అప్పుడప్పుడు క్రికెటర్లు కొన్ని అనూహ్యమైన రికార్డులు కూడా సృష్టిస్తుంటారు. ఇప్పుడు దినేశ్ కార్తీక్ ఖాతాలోనూ అలాంటి అరుదైన రికార్డే నమోదైంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బెస్ట్ ఫినిషర్‌గా అవతారమెత్తి భారత జట్టులోకి అడుగుపెట్టిన ఈ వెటరన్ వికెట్ కీపర్.. తన అంతర్జాతీయ కెరీర్లో 10 మంది కెప్టెన్ల కింద ఆడి రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంతవరకు ఏ ఒక్క ఆటగాడు ఇంతమంది కెప్టెన్ల కింద ఆడిన దాఖలాలు లేవు.…
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ పని ఇక అయిపోయిందని అనుకున్న తరుణంలో భారత జట్టులోకి ఎవ్వరు ఉహించని విధంగా పురాగమనం చేశాడు. IPL 15వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అద్భుతంగా రాణించాడు. 16 మ్యాచ్‌లలో 55 సగటు, 83.33 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2022లో కీపర్, బ్యాటర్‌గా రాణించడంతో దక్షిణఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దక్షిణఫ్రికాతో రెండో టీ20కి…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవ్వడానికి ముందు నుంచే, ఇదే మహేంద్ర సింగ్ ధోనీది చివరి ఐపీఎల్ లీగ్ అనే ప్రచారం ఊపందుకుంది. ఇక సీజన్ ప్రారంభంలో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో.. ఆ ప్రచారం నిజమేనని అంతా అనుకున్నారు. ఈ టోర్నీ సగంలో మళ్ళీ చెన్నై పగ్గాల్ని ధోనీ అందుకున్నప్పటికీ.. అతనిపై భవిష్యత్తుపైనే సరైన స్పష్టత రాలేదు. వచ్చే సీజన్ ఆడుతాడా? లేదా? అనేది మిస్టరీగానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ఆ జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు గుజరాత్ టైటాన్స్ చెమటోడ్చింది. మొదట్లో దూకుడుగానే ఆడింది, మధ్యలో వికెట్లు పడినా పరుగుల వర్షం తగ్గలేదు, కానీ లక్ష్యానికి చేరువవుతున్న క్రమంలోనే గుజరాత్ జట్టు కాస్త పట్టు తప్పినట్టు కనిపించింది. తీవ్రంగా శ్రమించి.. చివరికి విజయం సాధించింది. ఆదివారం డబుల్ హోల్డర్‌లో భాగంగా.. తొలి మ్యాచ్ సీఎస్కే, గుజరాత్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన చెన్నై,…
క్రికెట్ ప్రియులు, ముఖ్యంగా ధోనీ అభిమానులు.. క్రీజులోకి వెళ్ళడానికి ముందు ధోనీ బ్యాట్ కొరకడాన్ని చాలా సందర్భాల్లో గమనించే ఉంటారు. అంతెందుకు.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌కి రావడానికి ముందు తన బ్యాట్ కొరుకుతూ కెమెరాకి చిక్కాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలెందుకు ధోనీ ఇలా చేస్తాడని గతంలో చాలామంది సందేహాలు వ్యక్తం చేసినా, సమాధానం దొరకలేదు. అయితే, ఇన్నాళ్ళ తర్వాత మాజీ క్రికెటర్ అమిత్…