Offensive Comments : ప్రపంచంలో క్రికెట్ కు ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే.. క్రికెట్లర్లు, వారి కుటుంబాలపై అభిమానులు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. బాగా ఆడితే ఆకాశానికి ఎత్తుతారు.. లేదంటే తీవ్రంగా విమర్శిస్తారు. ఈ సందర్భంలో వాళ్ల కుటుంబాలు బాగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ మధ్య ధోనీ, కోహ్లీల విషయంలో ఇలాంటిదే జరిగింది. ధోనీ, కోహ్లీ కుమార్తెలపై అసహ్యకరమైన పోస్టులు పెట్టారు నెటిజన్స్.
దీంతో ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ అసహ్యకరమైన వ్యాఖ్యల స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేశారు. భారత మాజీ కెప్టెన్‌లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి కుమార్తెలు వేధింపులకు గురిచేస్తున్నారని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ బుధవారం దృష్టికి తీసుకొచ్చారు. ఆమె తన సోషల్ మీడియాలో కొంతమంది అభిమానుల వేధింపుల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని పిలుపునిచ్చింది. “ఒక 2 నుంచి 7 ఏళ్ల అమ్మాయిల గురించి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తారా? మీరు ఒక ఆటగాడిని ఇష్టపడకపోతే, అతని కుమార్తెను దుర్భాషలాడతారా? ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని పోలీసులకు నోటీసు జారీ చేశాను” అని ఆమె ట్వీట్ చేసింది.
Read Also: Babar Azam: మరో వివాదంలో పాకిస్థాన్ కెప్టెన్.. హనీ ట్రాప్‌లో బాబర్ ఆజమ్
ఢిల్లీ మహిళా కమిషన్ స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత సెక్షన్ కింద సిటీ పోలీస్ స్పెషల్ సెల్ యూనిట్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. వ్యాఖ్యల అంశంపై నోటీసు జారీ చేసిన తర్వాత పోలీసుల నుంచి స్పందన వచ్చిందని ఆమె ట్విట్లర్లో పేర్కొ్న్నారు. ‘@ImVKohli, @MSDhoni కుమార్తెలపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతి త్వరలో దోషులందరినీ అరెస్టు చేసి కటకటాల వెనక్కి తీసుకుంటారు’ అని ఆమె హిందీలో ట్వీట్ చేసింది.
Read Also: Family Suicide: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
देश के 2 बड़े खिलाड़ी विराट कोहली और धोनी की बच्चियों की तस्वीरें ट्विटर पर डालकर कुछ एकाउंट्स भद्दी टिप्पणी कर रहे हैं। 2 साल & 7 साल की बच्ची के बारे में ऐसी घटिया बातें? कोई खिलाड़ी नहीं पसंद तो क्या उसकी बच्ची को गाली दोगे? पुलिस को FIR दर्ज करने के लिए नोटिस जारी कर रहे हैं। pic.twitter.com/9ybadS659r
— Swati Maliwal (@SwatiJaiHind) January 11, 2023