ఇండియాలో క్రికెట్ ఓ మతం అంటుంటారు. దానికి తగ్గట్టుగానే క్రికెటర్లను అభిమానులు దేవుళ్లుగా కొలుస్తారు. తమ అభిమాన ఆటగాడి కోసం కటౌట్లు కడతారు.. టీ షర్టులపై బొమ్మలు, పచ్చబొట్టు వేయించుకుంటారు. ఆ కోవలోనే మరో అభిమాని నడిచాడు. ఈ ఫ్యాన్ అందరికి భిన్నంగా ఆలోచించాడు. తన పెళ్లి శుభలేఖపై వినాయకుడి ఫొటోతో పాటు తన అభిమాన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఫోటో కూడా ప్రింట్ చేయించాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫిలోని ఓ ఫోటోను పెళ్లి కార్డుపై ముద్రించాడు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోపై నెటిజన్ల్ ఫన్సీ కామెంట్స్ చేస్తున్నారు. ధోనీ జెర్సీ నంబర్ 7ను ఉద్దేశిస్తూ.. అతడు 7జన్మల బంధం కోసం 7 అడుగులు వేయాలనుకుంటున్నాడు.. అని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Aslo Read : RGV Song On Dogs: మేయర్ పై ఆర్జీవీ సాంగ్.. పాపం ఎవరిది అంటూ పాటతో ప్రశ్న
సౌరభ్ గంగూలీ కెప్టెన్ గా ఉన్నప్పుడు భారత క్రికెట్ జట్టులోకి ఆడుపెట్టిన ధోనీ.. ఆ తర్వాత భారత క్రికెట్ స్వరూపాన్ని సమూలంగా మార్చేశారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ చెరగని అధ్యాయం లిఖించాడు. ఓ దశాబ్దం పాటు క్రికెట్ ను శాసించాడు. దిగ్గజాలు సైతం సలాం చేసే స్థాయికి ఎంఎస్ ధోని ఎదిగాడు. గ్రౌండ్ లో ధోని ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టు గెలుస్తుందని అభిమానులు అనుకునేంతలా.. అతడి ప్రదర్శన ఉండేది. కెప్టెన్ గా జట్టును నడిపించిన తీరు కూడా అతడిని అగ్రస్థానానికి తీసుకెళ్లింది. ధోని సారథ్యంలోనే 2007,2011 వరల్డ్ కప్ లు 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియన్ టీమ్ గెలుచుకుంది.
Aslo Read : Japan: పిల్లల్ని ఎలా కనాలో నేర్పుతున్న నగరం.. ఎగబడి వెళ్తున్న జపాన్ ప్రజలు!