MS Dhoni: ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇక తగ్గేదే లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేంద్రసింగ్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఐపీఎల్ 2023 కోసం మహీ రంగంలోకి దిగాడు. కొద్దిరోజులగా ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కేవలం ఐపీఎల్‌లోనే ఆడుతున్న మహీ చాలా రోజుల తర్వాత బ్యాట్ పట్టాడు. నాలుగుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించిన ఈ మిస్టర్ కూల్.. ఈసారి మైదానంలో గర్జించేందుకు సిద్ధమయ్యాడు. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నెట్స్‌లో సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు రవీంద్ర జడేజా కూడా శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకొని మళ్లీ టోర్నీలకు సిద్ధమవుతున్నాడు.
Exclusive video of #MSDhoni batting practice at JSCA 💥🦁 pic.twitter.com/gYYR6hCpYY
Also Read
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
- Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
— Nithish MSDian 🦁 (@thebrainofmsd) January 25, 2023
నిరుడు ఐపీఎల్‌కు ముందే ధోనీ ఈ మెగాలీగ్ నుంచి తప్పుకొంటాడన్న వార్తలు వచ్చాయి. కానీ వాటన్నంటికీ సమాధానం చెబుతూ గతేడాది మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈసారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. కాగా, ఆటగాడిగా ధోనీకి ఈ ఐపీఎల్ చివరిదని ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది జరిగే లీగ్‌లో ధోనీ ఆడటం దాదాపు అసాధ్యమే. అసలు ఈ ఏడాదే అతడు తప్పుకోవాల్సింది. అయితే తన చివరి మ్యాచ్‌ను చెన్నైలో ఆడాలని ఉందని, అక్కడ ఆడిన తర్వాతనే రిటైర్‌మెంట్ తీసుకుంటానని మహీ గతంలోనే చెప్పాడు. దీంతో ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో అతడు తన చివరి మ్యాచ్ ఆడేస్తాడని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కూడా సీఎస్కే జట్టుతోనే ధోనీ ఉంటాడని, మెంటార్‌గానో లేక కోచ్‌గానో బాధ్యతలు నిర్వర్తిస్తాడని సమాచారం. గతేడాది దారుణంగా విఫలమైన చెన్నై.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని చూస్తోంది. దానికోసం ఇప్పటికే మినీ వేలంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (రూ.16.25 కోట్లు)ను కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆ జట్టులో ధోనీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, అంబటి రాయుడు, రుతురాజ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.
తాజావార్తలు
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!