టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత.. కూడా అతని ఫ్యాన్ ఫాలోయింగో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు అంటే అతిశయోక్తి కాదు.. ధోనిని అభిమానించే వారి జాబితాలో సామాన్వులే కాదు ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని ప్రముఖ సినీ నటీ ఖుష్బూ అత్తగారిని కలిసి సర్ ప్రైజ్ చేశాడు. కాగా చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. దీని తర్వాత ఈ నెల 17న బెంగళూరుతో ధోని సేన ఆడాల్సి ఉంది. అయితే మ్యాచ్ కు ముందు నాలుగు రోజుల విశ్రాంతి దొరకడంతో ధోని రెస్ట్ తీసుకుంటున్నాడు.
Read Also : Violence in Sambalpur: సంబల్‌పూర్‌లో చెలరేగిన హింస.. పట్టణంలో కర్ఫ్యూ విధింపు
అయితే తన అభిమానులను కలుస్తూ సర్ ప్రైజ్ చేస్తున్నాడు. అలా తాజాగా సినీ నటి ఖుష్బూ ఫ్యామిలీ మెంబర్స్ ను కలిశాడు. ఈ సందర్భంగా తమను కలిసేందుకు వచ్చిన ధోనిని ఖుష్బూ అత్తగారు ఆప్యాయంగా ముద్దాడారు. అందరూ కలిసి సరదాగా ఫోటోలు దిగారు. మహేంద్ర సింగ్ ధోనితో దిగిన ఫోటోలను ఖుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో సింప్లిసిటీపై ప్రశంసలు కురిపించాడు. హీరోలు తయారుకారు.. పుడతారు.. కానీ ధోనీ ఆ విషయాన్ని ఇవాళ నిరూపించాడు.. ధీనీ ప్రేమ, ఆతిథ్యానికి నాకు మాటలు రావడం లేదు అని ఖుష్బూ పేర్కొన్నారు. మా అత్తగారు ధోనిని ఎంతగానో ఆరాధిస్తుంటారు.. ఇప్పుడామెను ధోని కలిసిరు.. ఆమె ఆయుష్షను, సంతోషాన్ని మరింత పెంచారు. ఇందుకు ధోనికి ప్రత్యేక ధన్యవాదములు.. అలాగే మా కలను నిజం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఓ విజిల్ అంటూ తన ఆనందానికి ఖుష్బూ అక్షర రూపిమిచ్చింది. ప్రస్తుతం ధోనీ-ఖుష్బూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read Also : Vidudala Part 1 Movie Review: విడుదల – 1 రివ్యూ (తమిళ డబ్బింగ్)