ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా నటించిన ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రానా దగ్గుబాటి ఈ ట్రైలర్ ను విడుదల చేశాడు. ఆర్‌పీ సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు.