రాష్ట్రంలో భారీగా ఎంపీడీఓల బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. నిన్న డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎంపీడీఓలను బదిలీ చేసింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని గతేడాది డిసెంబర్‌లో ఎన్నికల కమిషన్ ఆదేశించింది.…